Home » Vizianagaram
విజయనగరం కార్పొరేషన్ (Vizianagaram Corporation) పేదలకోసం నగరానికి సమీపంలో గుంకలాం వద్ద ఏర్పాటుచేసిన జగనన్న లేఅవుట్‌ను జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) ఆదివారం పరిశీలించనున్నారు.
ఎంత సంపాదించాం అనేది కాదు.. ఎలా బతికాం అనేది ముఖ్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సాయి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. చదువు తన కోసమే కాకుండా సమాజం, దేశం కోసం ఉపయోగపడాలన్నారు. న్యాయ సేవల దినోత్సవం పురస్కరించుకుని స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో బుధవారం సదస్సు జరిగింది.
ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు పరీక్షలు బుధవారం నుంచి 11వ తేదీ వరకూ జరుగుతాయని డీఆర్వో గణపతిరావు తెలిపారు. పరీక్షల ఏర్పాట్లపై మంగళవారం తన చాంబర్లో సమీక్షించారు.
శృంగవరపుకోట బీసీ కళా శాల వసతి గృహాన్ని ఆదివారం జిల్లా సంక్షేమ అధికారి ఎం.యశోదరావు తనిఖీ చేశారు. రి
ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రతి నెలా ఒకటో తేదీన ఠంచన్‌గా జీతం పడుతుందని ఓ భరోసా. అంతకుముందు అలాగే పడేది కూడా! కానీ..
రైన రోడ్లు లేవు. వాహనాలు అస్సలు రావు. అత్యవసరమైతే రాళ్లపైనే నడక. డోలీలే అంబులెన్స్‌లు. 10-20 కి.మీ. మోయాలి. ఆలోపే ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. చచ్చిపోతున్నా అధికారులకు పట్టదు. ప్రజాప్రతినిధులూ కన్నెత్తి చూడరు. ఓట్లు తప్ప హామీలేవీ గుర్తుండవు. రోడ్లు వేయించండి మహాప్రభో.. అని మొత్తుకుంటున్నా కనికరించరు. చచ్చిపోతున్నాం సార్.. అంటున్నా ఉలకరు.. పలకరు. వాళ్లు గిరిజనులే కదాని చిన్నచూపేమో! ఎట్లాగూ నిలదీయలేరని నిర్లక్ష్యమేమో!
రాజాం పట్టణంలోని ఓ వీధిలో ఇంటి వద్దకు పదుల సంఖ్యలో యువత చేరుతుంటారు. చేతిలో సెల్‌ఫోన్‌తో నిత్యం గడుపుతుంటారు. ఏదో సినిమానో, షార్ట్ వీడియోలు చూస్తుంటారని చాలా మంది అనుకుంటున్నారు. వారు బెట్టింగ్ ఆడుతున్నట్లు అతి కొద్దిమందికే తెలుసు.
కోమటిపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు, ఉప సర్పంచ్ వసంత శ్రీనివాసరావు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో శుక్రవారం చేరారు. మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు అతన్ని పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీనివాసరావు వెంట మరో 200 మంది వైసీపీ కార్యకర్తలు కూడా తెలుగుదేశంలో చేరారు.
అభివృద్ధిని విస్మరించిన ప్రభుత్వానిది కాదా ఈపాపం! హామీలిచ్చి అటకెక్కించిన నాయకగణానిది కాదా ఈపాపం! గిరిజనులే కదాని నిర్లక్ష్యం వహించిన పాలకులది కాదా ఈపాపం! రోడ్డు సరిగాలేక.. వైద్యం సకాలంలో అందక ఓ 39 ఏళ్ల గిరిజనుడు ప్రాణాలొదిలాడు. భార్య, ఇద్దరు పిల్లలు దిక్కులేని వారయ్యారు.
క్రీడల నిర్వహణ ద్వారా ఆయా ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి లభించడం ఖాయమని, షార్జా, సియోల్ వంటి నగరాలకు ప్రపంచ స్థాయి లో గుర్తింపురావడానికి అదే కారణమని విశాఖ ఎమ్మెల్యే, రాష్ట్ర వాలీబాల్ అసోసి యేషన్ అధ్యక్షుడు పీజీవీఆర్ నాయుడు(గనబాబు) అన్నారు.