Home » YS Jagan
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత మరుసటి రోజు నుంచే వైసీపీ షాక్‌లు మొదలయ్యాయి. నాడు మొదలైన బిగ్ షాక్‌లు నేటికి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. రోజుకో నేత.. రెండ్రోజులకో ఇద్దరు ఎంపీలు రాజీనామాతో దెబ్బ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది...
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కుదుపులు ప్రారంభమయ్యాయి. ఎన్నికలు పూర్తైన మూడు నెలలకే అతి పెద్ద కుదుపు వచ్చి పడింది.
వైసీపీ ఆవిర్భావం నుంచి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కుడి భుజంగా ఉన్న మోపిదేవి వెంకటరమణ.. ఆ పార్టీకి రాజీనామా చేసేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీలో విసిగివేసారిపోయిన ఆయన గుడ్ బై చెప్పేశారు.. ఈ సందర్భంగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడిన మోపిదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్, వైఎస్ జగన్ పేర్లు ప్రస్తావించి మరీ.. ఇద్దరి మధ్య ఉన్న తేడాలను కూడా చెప్పుకొచ్చారు..
వైసీపీ ఆవిర్భావం నుంచి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కుడి భుజంగా మోపిదేవి వెంకటరమణ ఉన్నా రు. ఆ పార్టీకి గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రస్తుతం బాపట్ల జిల్లాలో పెద్ద దిక్కు గా వ్యవహరించారు. అయితే జగన్ తీరుతో పార్టీలో ఇమడలేకపోతున్న రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా పార్టీని వీడేందుకు సిద్ధమవటం ఆ పార్టీకి పెద్ద షాక్‌గా చెప్పవచ్చు..
అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ అధ్యక్షులు, మాజీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆయన యూకే వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరారు.
అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ లైఫ్ సైన్సెస్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను, క్షతగాత్రులను పరామర్శించాలని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్(Jagan) నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అడుగడుగునా అడ్డుకోవాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ ప్రయత్నిస్తున్నారని మాజీమంత్రి జవహర్ ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై బురద జల్లాలని ఆ పార్టీ నేతలు విశ్వప్రయత్నాలు చేశారని విమర్శించారు.
Andhrapradesh: విదేశాలు వెళ్లేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి సీబీఐ కోర్టులో మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిటిషన్ వేశారు. 20 రోజుల పాటు కుటుంబంతో కలిసి లండన్, యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోరారు. లండన్‌లో ఉన్న కూతురుని చూడటానికి వెళ్లాలని..
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ మరోసారి వాయిదా పడింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను వేగవంతం చేయాలన్న పిల్‌పై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. జగన్ కేసులప త్వరితగతిన విచారణ జరపాలని హరిరామ జోగయ్య పిల్ దాఖలు చేశారు.
ఆమె ఒక పేద ముస్లిం మహిళ. ఆమె పేరు మీద ఉన్న అరెకరం పొలమే కుటుంబానికి జీవనాధారం. ఆ భూమి దశాబ్దాల నుంచి వారి స్వాధీనంలోనే ఉంది.