Home » Yuvagalam Padayatra
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) మంగళవారం రాత్రి నుంచీ తిరుపతి జిల్లా (Tirupati District)లో రెండవ విడత ప్రారంభం కానుంది.
సీఎం జగన్ (CM Jagan) దగ్గర బ్లూ, రెడ్ బటన్లు ఉంటాయని, బ్లూ బటన్లో రూ.10 వేలు వేసి.. రెడ్ బటన్‌తో రూ.100 లాగేస్తాడని టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh) దుయ్యబట్టారు.
కొండలు, గుట్టల మీదుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్ర సాగింది. ‘యువగళం’లో (Yuvagalam) 130వ రోజు ఆదివారం పది కిలోమీటర్ల దూరం లోకేష్ పాదయాత్ర చేశారు.
నెల్లూరు జిల్లాలో నక్సల్ ప్రభావిత ప్రాంతమైన కలువాయి మండలంలో నారా లోకేష్ యువగళం 129వ రోజు పాదయాత్ర శనివారం సందడిగా సాగింది.
నేను ఎవ్వరినీ వదిలిపెట్టను. తగ్గేదే లేదు. అన్నీ నా ఎర్రబుక్లో రాసుకుంటున్నా’’ అని నారా లోకేశ్ (Nara Lokesh) హెచ్చరించారు.
అడుగడుగునా ఎదురైన పల్లెలు. సాదర స్వాగతం పలికిన పల్లె పడతులు. ఐదేళ్లలో ఎదురైన నష్టాలు.. కష్టాలు చెప్పుకొంటూ కనికరించమని రైతుల అభ్యర్థనలు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా బొమ్మవరం క్యాంపు సైట్‌లో హెలో లోకేశ్ పేరుతో యువతతో యువనేత ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వంలో ప్రతి జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచంలో టాప్ టెన్ కంపెనీలని తీసుకువచ్చామని చెప్పారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా నాయుడుపల్లెలో రైతులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ... టీడీపీ హయాంలోనే ప్రభుత్వం రైతులకు అండగా నిలబడిందన్నారు. అనిల్ ఇరిగేషన్ మంత్రిగా జిల్లాలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తిచేయలేదని... వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి కూడా విఫలమయ్యారని విమర్శలు గుప్పించారు.
నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర అధికార వైసీపీకి శవయాత్రగా మారిందా..? గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో లోకేశ్ పాదయాత్రకు అనూహ్య స్పందన రావడం మార్పునకు సంకేతమా..? కడప జిల్లాలో ముగిసిన నారా లోకేశ్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో ఎంటర్ అయీ కావడంతోనే వైసీపీకి ఝలక్ తగిలిందా..?
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాలో లోకేశ్ యువగళం పాదయాత్ర అట్టర్ ప్లాఫ్ అని.. టీడీపీ వారే ఆ విషయం మాట్లాడుకుంటున్నారని తెలిపారు. జిల్లాలో 24 లక్షల మంది ఓటర్లు ఉన్నారని... కనీసం ఒక్క శాతమంటే 24 వేల మంది కూడా రాలేదన్నారు.