Home » Telangana » Adilabad
వీధి శునకా లకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయడం ద్వారా వాటి వ్యాప్తిని నిర్మూలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని అం డాళమ్మ కాలనీ సమీపంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పశు సంరక్షణ కేంద్రం పేరుతో ఆస్పత్రి భవనాన్ని నిర్మిం చారు.
మండలంలోని రేపల్లెవాడలోని శ్రీరామ జిన్నింగ్ మిల్లులో సీసీఐ ద్వారా నిర్వహించే పత్తి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి పేర్కొన్నారు. గురువారం పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రభుత్వ సమీకృత పథకాల నిర్వహణ సమర్ధవంతంగా చేపట్టాలని దిశ చైర్మన్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ కుమార్ దీపక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, డీఆర్డీవో కిషన్లతో కలిసి దిశ (డిస్టిక్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ) జిల్లా అభివృద్ధి సమన్వయ పరిరక్షణ కమిటీ త్రైమాసిక సమావేశానికి హాజరయ్యారు.
సీఎం సహాయ నిధి పథకం పేదలకు వరమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో రూ. 10,40,500 విలువ గల 50 సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పథకం వల్ల పేదలకు ఎంతో ఆర్ధిక మేలు జరుగు తుందన్నారు.
వివిధ ధ్రువపత్రాలకు అందిన దరఖాస్తులను పరిశీలించి నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. సర్టిఫికెట్లను త్వరగా జారీ చేయాలని సూచించారు.
చింతలమానేపల్లి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): స్థానికసంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల అయినా పోటీలో ఉండేలా ఆశావాహులు సన్నద్దమవుతున్నారు.
ఆసిఫాబాద్ రూరల్, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): సమగ్ర కుటుంబసర్వేను పకడ్బంధీగా నిర్వహించా లని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
వాంకిడి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): వాంకిడి గిరి జన ఆశ్రమపాఠశాలలో విద్యార్థినుల అనారోగ్యానికి కారకులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తుడుం దెబ్బ నాయకులు మండలకేంద్రంలో అంతర్రాష్ట్ర రహదారిపై ధర్నా చేపట్టారు.
ఆసిఫాబాద్, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలు విస్త రించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
కాగజ్నగర్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో గురువారం ఛట్ పూజలు ప్రారంభమయ్యాయి. బీహార్, జార్ఖండ్, ఉత్తర్ప్రదేశ్ వాసులు అధికంగా ఈ పూజలు చేస్తారు. ఎస్పీఎం నీటి కొలనులో దిగి గురువారం సాయంత్రం నుంచి సూర్యదేవుడికి పూజలు చేశారు.