Home » Telangana » Hyderabad
Telangana: ప్రతి రోజు రాష్ట్రంలో ఏదో ఒక చోట ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు ఆసుపత్రుల పాలవ్వడంతో, సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో వారి పిల్లల క్షేమం పట్ల భయాందోళన నెలకొందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. కనీసం పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించకపోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనంగా మారిందని విమర్శించారు.
Telangana: ఎమ్మెల్యేలు ప్రజలకు దూరం అవ్వడానికి, ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం పీఏలు, పీఆర్ఓలు అంటూ శాసనమండలి చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలతో ప్రజాప్రతినిధులను దూరం చేయడానికి మొదటి కారణం పీఏలు, పీఆర్ఓలు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కోసం ఎవరైనా ఫోన్ చేస్తే పీఏలు, పీఆర్ఓలు దురుసుగా మాట్లాడుతారన్నారు.
Telangana: ప్రముఖ నటుడు మోహన్‌బాబు హైకోర్టును ఆశ్రయించారు. తనకి పోలీసులు జారీ చేసిన నోటీస్‌ని సవాలు చేస్తూ... హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన ఇంటి వద్ద పోలీస్ పీకెట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.
Manchu Manoj Row: మంచు వారి ఇంట జరుగుతున్న రచ్చ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గడిచిన మూడు రోజులగా ఈ వ్యవహారం మరింత ముదురుతుందే తప్ప.. ఏ కోశానా తగ్గుతున్నట్లు కనిపించడం లేదు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 11 తేదీ నుంచి 13వ తేదీ వరకు రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ముందుగా బుధవారం (11న) రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌కు ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. అక్కడ కొన్ని వ్యక్తిగత పనులు పూర్తి చేసుకున్న అనంతరం ఢిల్లీకి వెళతారు. 12, 13 తేదీల్లో ఢిల్లీ పెద్దలను రేవంత్ రెడ్డి కలవనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు శిక్షణాతరగతులు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ శిక్షణా తరగతులను బీఆర్ఎస్ బహిష్కరించింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల హక్కులకు స్పీకర్ భంగం కల్గించేలా వ్యవహరించారని కేటీఆర్ పేర్కొన్నారు.
మంచు ఫ్యామిలీ విభేదాలు పీక్ స్టేజీకి చేరాయి. కవర్ చేసే మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు చిందులేశారు. ఇద్దరు రిపోర్టర్లపై దాడికి తెగబడ్డారు. మీడియాపై మోహన్ బాబు దాడిని జర్నలిస్టులు, మేధావులు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ ఖండించారు.
మనోజ్ ను జల్ పల్లి ఫామ్ హౌస్ లోకి రానీయకుండా వాచ్ మెన్ గేటు మూసివేశారు. ఆ క్రమంలో మనోజ్ పై బౌన్సర్లు దాడి చేశారు. మోహన్ బాబు తీవ్ర ఆవేశానికి లోనయ్యారు. ఇన్సిడెంట్ కవర్ చేసే మీడియా ప్రతినిధులపై దాడి చేశారు.
మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం మరో కీలక మలుపు తిరిగింది. జల్పల్లి నివాసం నుంచి చిన్న కుమారుడు మంచు మనోజ్‌ను పంపించేందుకు మోహన్ బాబు సిద్ధమయ్యారు. ఇరువురి మధ్య ఘర్షణ నేపథ్యంలో మనోజ్ తన ఇంట్లో ఉండేందుకు కుదరదంటూ ఆయన తేల్చి చెప్పారు.
ఈ ఏడాది రైతులకు మరింత లబ్ధి చేకూర్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అన్నదాతలకు యంత్రపరికరాలు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందించాలని స్పష్టం చేశారు. రైతన్నలకు చేయూత నిచ్చి పంటల దిగుబడి పెంచే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు.