Share News

Mohan Babu: చట్టం తన పని తాను చేసుకుంటుంది: మంత్రి పొంగులేటి

ABN , Publish Date - Dec 10 , 2024 | 09:57 PM

మంచు ఫ్యామిలీ విభేదాలు పీక్ స్టేజీకి చేరాయి. కవర్ చేసే మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు చిందులేశారు. ఇద్దరు రిపోర్టర్లపై దాడికి తెగబడ్డారు. మీడియాపై మోహన్ బాబు దాడిని జర్నలిస్టులు, మేధావులు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ ఖండించారు.

Mohan Babu: చట్టం తన పని తాను చేసుకుంటుంది: మంత్రి పొంగులేటి
Mohan Babu

హైదరాబాద్: మంచు ఫ్యామిలీ విభేదాలు పీక్ స్టేజీకి చేరాయి. కవర్ చేసే మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు చిందులేశారు. ఇద్దరు రిపోర్టర్లపై దాడికి తెగబడ్డారు. మీడియాపై మోహన్ బాబు దాడిని జర్నలిస్టులు, మేధావులు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ ఖండించారు. మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


మీడియా ప్రతినిధిపై దాడి నేపథ్యంలో మోహన్ బాబుకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నోటీసులు జారీచేశారు. మోహన్ బాబుతో పాటు మంచు మనోజ్, మంచు విష్ణులకు కూడా రాచకొండ పోలీసులు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రేపు ఉదయం 10.30 గంటలకు వీరంతా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించినట్లుగా సమాచారం. జల్ పల్లిలో జరిగిన ఘటన విచారిస్తారు. మోహన్ బాబు, విష్ణు గన్ లైసెన్స్ లను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. జల్ పల్లిలో జరిగిన గొడవ తర్వాత మోహన్ బాబు ఆరోగ్యం క్షీణించినట్టు తెలిసింది. కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారని విశ్వసనీయ సమాచారం.


జల్ పల్లి ఘటనపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. రిపోర్టర్ పై మోహన్ బాబు దాడి చేయడాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖండించారు. చట్ట ప్రకారం నడుచుకుంటామని స్పష్టం చేశారు. మోహన్ కేసులో చట్టం తన పని తాను చేసుకుంటుందని స్పష్టం చేశారు.

Updated Date - Dec 10 , 2024 | 10:35 PM