Share News

Mohanbabu vs Manoj: బోరున ఏడ్చేసిన మనోజ్..

ABN , Publish Date - Dec 11 , 2024 | 11:30 AM

Manchu Manoj Row: మంచు వారి ఇంట జరుగుతున్న రచ్చ తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. గడిచిన మూడు రోజులగా ఈ వ్యవహారం మరింత ముదురుతుందే తప్ప.. ఏ కోశానా తగ్గుతున్నట్లు కనిపించడం లేదు.

Mohanbabu vs Manoj: బోరున ఏడ్చేసిన మనోజ్..
Manchu Manoj Row

Manchu Manoj Row: మంచు వారి ఇంట జరుగుతున్న రచ్చ తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. గడిచిన మూడు రోజులగా ఈ వ్యవహారం మరింత ముదురుతుందే తప్ప.. ఏ కోశానా తగ్గుతున్నట్లు కనిపించడం లేదు. మంగళవారం నాడు జరిగిన గొడవకు కంటిన్యూగా.. ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్.. కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇంట్లో డబ్బులు, ఆస్తి అడగలేదని స్పష్టం చేశారు. అనవసరంగా తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు అనేక బాధలు అనుభవించానని మనోజ్ చెప్పుకొచ్చారు. తన నాన్న స్నేహితులు చెప్పడం వల్లే తాను ఇంటికి తిరిగొచ్చానని మనోజ్ వివరించారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

ఇలాంటి రోజు వస్తుందని ఏనాడూ ఊహించలేదన్నారు. నాన్న తరఫున క్షమాపణలు కోరుతున్నట్లు మనోజ్ ప్రకటించారు. ఈ సందర్భంగా మనోజ్ కన్నీటిపర్యమంతయ్యారు. సాయంత్రం ప్రెస్‌మీట్ పెట్టి అన్ని వివరాలను వెళ్లడిస్తానని మనోజ్ ప్రకటించారు. తాను తన సొంతకాళ్ల మీద నిలబడుతున్నానని మనోజ్ చెప్పారు. తన బంధువులపై దాడి చేశారని ఆరోపించారు. ఇన్నాళ్లూ ఆగానని.. ఇక ఆగలేనని మనోజ్ స్పష్టం చేశారు.


భావోద్వేగానికి లోనైన మంచు మనోజ్...

మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు మంచు మనోజ్. ఈ సందర్భంగా సంచలన విషయాలు బయటపెట్టారు. మీడియాపై దాడికి తండ్రి తరఫున క్షమాపణలు చెప్పారు. ‘మా నాన్న అంటే నాకు ప్రాణం.. మా నాన్న దేవుడు. మా నాన్నను మా అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశారు. మా నాన్న దృష్టిలో నన్ను శత్రువుగా చిత్రీకరించారు.’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు మనోజ్. తాను ఏ తప్పు చేయకపోయినా.. తన వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని.. అందులో తప్పేంటని మనోజ్ ప్రశ్నించారు. పదిమంది కోసం నిలబడ్డానని.. అందుకే తాను చెడ్డగా మారానని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబం కోసం గోడ్డులా కష్టపడ్డానన్నారు. పని చేసినందుకు ప్రతిఫలం కూడా అడగలేదన్నారు. ఈరోజు తాను ధైర్యంగా పోరాడకపోతే పెద్ద అయ్యాక నా పిల్లల ముందు తల ఎత్తుకోలేనని అన్నారు. అమ్మ హాస్పిటల్‌లో అడ్మిట్ అయిందని అబద్ధాలు ఆడారన్నారు. గుండెలో దడ ఉంది అంటే హాస్పిటల్‌కి వెళ్ళిందని.. అనంతరం ఆన్న ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారని మనోజ్ వివరించారు. మౌనికను ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. మౌనిక తల్లిదండ్రులు ఉంటే ఊరికే ఉంటారా? అని మనోజ్ ప్రశ్నించారు. లాక్ డౌన్‌లో అహం బ్రహ్మాస్ని సినిమా మధ్యలో ఆపేశారని పేర్కొన్నారు. తాను, తన భార్య కలిసి ఒక టాయ్స్ కంపెనీ పెట్టామన్నారు. వాటికి కూడా అడ్డంకులు సృష్టించారని, తనపై దాడులు చేశారని మనోజ్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన తండ్రి ముందే తనను కొట్టారని.. తనకు సపోర్ట్ చేస్తున్న తన అమ్మను కూడా డైవర్ట్ చేశారని మనోజ్ ఆరోపించారు. 3 రోజులు బయటకు వెళ్ళు.. మనోజ్‌కి సర్దిచెప్తామని తన అమ్మను నమ్మించారన్నారు. అటు నుంచి ఆస్పత్రిలో చేర్పించారన్నారు. ఆ తరువాత నుంచి తనపై దాడులు మొదలుపెట్టారని మనోజ్ పేర్కొన్నారు.

Updated Date - Dec 11 , 2024 | 12:54 PM