Home » Telangana » Nizamabad
నిజామాబాద్ లోక్‌సభ సమీక్ష సమావేశాన్ని సోమవారం నాడు నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజా మాజీ ఎమ్మెల్యేల మీద కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు అధిష్టానాన్ని కలవకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారని కవిత మండిపడ్డారు.
Telangana: జిల్లాలోని నసురుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో న్యూ ఇయర్ వేడుకల్లో ఘర్షణ చోటు చేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది.
Telangana: 2023 సంవత్సరానికి సంబంధించిన కేసుల వివరాలను జిల్లా ఎస్పీ సింధు శర్మ శనివారం మీడియాకు వెల్లడించారు. గతేడాది కంటే ఈ ఏడాది కేసుల సంఖ్య తగ్గినట్లు వెల్లడించారు. 28 హత్యలలో 20 హత్యలు ఆస్తి, కుటుంబ సభ్యుల తగదాలతో జరిగినవన్నారు.
కామారెడ్డి జిల్లా: నిజాంసాగర్ మండలం, నర్సింగ్ రావ్ పల్లి శివారులో 161 జాతీయ రహదారిపై అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బోలోరో వాహనం మోటార్ సైకిల్‌ను ఢీ కొంది.
ధికారులు జవాబుదారీతనంతో పని చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupalli Krishna Rao ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు నిజామాబాద్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ సముదాయంలో ప్రజాపాలనపై ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు.
కామారెడ్డి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ( BRS ) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ( Shabbir Ali ) సమక్షంలో ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ ( Congress ) పార్టీలో చేరారు. షబ్బీర్ అలీ వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ పరిణామంతో బీఆర్ఎస్ కేడర్ అయోమయంలో పడిపోయింది.
జిల్లాలోని జుక్కల్ మండలం డోన్గావ్ గ్రామ పంచాయితీలోని శక్తి నగర్ గ్రామంలో విషాదం నెలకొంది. శక్తి నగర్ కౌలాస్ నాల బ్యాక్ వాటర్ బ్రిడ్జ్‌పై నుండి భార్యని భర్త కిందకు తొసేశాడు. మృతురాలు బిరాదర్ శివాని (20)గా గుర్తించారు.
కామారెడ్డి జిల్లా: కామారెడ్డి కలెక్టరేట్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖలో ఉద్యోగాల పేరిట నకిలీ నియామక పత్రాలు జారీ చేసింది.
Telangana: జిల్లాలోని దోమకొండలో వడ్డీ వ్యాపారి ఇంటిపై మహిళల దాడి చేశారు. కాశీనాథ్ అనే వ్యాపారి వద్ద కామారెడ్డికి చెందిన కవిత రూ.5 లక్షల అప్పు తీసుకుంది.
Telangana: జిల్లాలో సంచలనం రేపిన ఆరు హత్యల కేసులో నిందితుడు గొల్ల ప్రశాంత్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని ప్రశాంత్ గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది.