Kamareddy: మరో ప్రముఖ ఆలయాన్ని దర్శించుకున్న బాలీవుడ్ నటి.. ఎవరంటే..
ABN , Publish Date - Jan 24 , 2025 | 12:43 PM
కామారెడ్డి: దోమకొండ మండలం గడికోట(Gadikota) మహాదేవుడి ఆలయాన్ని బాలీవుడ్(Bollywood), హాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) దర్శించుకున్నారు. ఇవాళ (శుక్రవారం) ఉదయం హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరి ఆలయం వద్దకు చోప్రా చేరుకున్నారు.

కామారెడ్డి: దోమకొండ మండలం గడికోట (Gadikota) మహాదేవుడి ఆలయాన్ని బాలీవుడ్ (Bollywood), హాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) దర్శించుకున్నారు. ఇవాళ (శుక్రవారం) ఉదయం హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరి ఆలయం వద్దకు చోప్రా చేరుకున్నారు. గడికోటకి వచ్చిన బాలీవుడ్ నటికి ట్రస్ట్ సభ్యులు, ఆలయ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మహాదేవుడిని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇటీవల హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్‌ను సైతం ప్రియాంక దర్శించుకున్నారు. దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కనున్న ఎస్ఎస్ఎంబీ-29 సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టు అనౌన్స్‌మెంట్ ఈవెంట్‌లో పాల్గొనేందుకే ఆమె హైదరాబాద్ వచ్చినట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ఐదేళ్ల తర్వాత ఆమె నటిస్తున్న భారతీయ చిత్రం ఎస్ఎస్ఎంబీ-29 కావడం విశేషం. కాగా, గడికోటకు వచ్చిన ప్రియాంక అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Virender Sehwag: విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్..
Kaleshwaram Commission: నేటి కాళేశ్వరం విచారణ.. అత్యంత కీలకం