Congress: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్ళే..
ABN , Publish Date - Jan 19 , 2025 | 08:30 AM
టీపీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎదుర్కొంటున్న తొలి ఎన్నికలు కావడంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ఆయన ప్రతిష్టాత్మంగా తీసుకున్నారు. ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో ఒకటైనా నిజామాబాద్ లోకల్ వ్యక్తి కావడంతో మహేష్ గౌడ్‌కు ఈ ఎన్నికలు సవాల్‌గా మారాయి.

హైదరాబాద్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ (Graduate MLC) ఎన్నికలపై (Elections) కాంగ్రెస్ (Congress) పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం మార్చి 31వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఆ ఎన్నికపై కాంగ్రెస్ గురి పెట్టింది. ప్రస్తుతం ఈ స్థానం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రాతినధ్యం వహిస్తున్నారు. సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ సర్వేలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఈసారి ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా నియమించాలనే అంశంపై ఇప్పటికే గాంధీ భవన్‌లో హస్తం నేతలు చర్చించారు. నాలుగు ఉమ్మడి జిల్లాల మంత్రులు, ఇన్చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షుల సమక్షంలో జరిగిన సమావేశంలో సిట్టింగ్ స్థానంగా ఉన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం మళ్లీ కంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేందుకు కావాలసిన స్ట్రేటజీపై చర్చించారు.
టీపీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎదుర్కొంటున్న తొలి ఎన్నికలు కావడంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ఆయన ప్రతిష్టాత్మంగా తీసుకున్నారు. ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో ఒకటైనా నిజామాబాద్ లోకల్ వ్యక్తి కావడంతో మహేష్ గౌడ్‌కు ఈ ఎన్నికలు సవాల్‌గా మారాయి. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కనిపించాలంటే ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ల స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవాల్సిందేనని హస్తం నేతలు భావిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీగా సిట్టింగ్ సీటు గెలవడం కాంగ్రెస్ పార్టీకి సవాల్‌గా మారింది.
సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డిని మరోసారి పోటీ చేయించాలని కొంతమంది కాంగ్రెస్ పెద్దలు కోరినా.. తనకు పోటీ చేసే ఆలోచన లేదని జీవన్ రెడ్డి సున్నితంగా తిరస్కరించారు. దీంతో కొత్త వ్యక్తులు టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం తరచుగా ఉద్యోగ ప్రకటనలు ఇస్తున్న నేపథ్యంలో కొంతమంది ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు తమకు సహకరిస్తారనే ఆలోచనతో చాలా మంది కాంగ్రెస్ టిక్కెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆల్‌ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, సివిల్స్ కోచింగ్ సెంటర్ అధినేత రమణారెడ్డి, మాజీ పోలీస్ అధికారి గంగాధర్, కోచింగ్ సెంటర్లకు చెందిన మరో అధినేత ప్రసన్న హరికృష్ణ కూడా కాంగ్రెస్ టిక్కెట్ కోసం హస్తం పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటన వారం లోపే ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ రెండు రోజుల క్రితం ప్రకటించారు. దీంతో ఆశావహులు తమ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు. ఎవరూ ఊహించని వ్యక్తి బరిలో ఉంటారని, సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ తాము కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీవారి ఆలయంలో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనాలు
ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణపై లోకేశ్ అసంతృప్తి
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News