Home » Telangana
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని జిల్లాకు అందించేందుకు ఎప్పటినుంచో ప్రతిపాదనలో ఉన్న పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి మోక్షం లభించనున్నది. ఆదివారం జిల్లాకు చెందిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పత్తిపాక సందర్శించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేతో బల్దియా సేవలు పూర్తిగా స్తంభించాయి. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మొదలుకొని నగరపాలక సంస్థ అందించే పౌర సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.
రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పొందేందుకు మరింత ఆలస్యం కానుంది. సన్న బియ్యం పొందడానికి సుమారు మరో ఆరు నెలలు ఆగాల్సిందే. జనవరిలో సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించినా ఆచరణ సాధ్యమయ్యేలా లేదు.
ఏపార్టీ అధికా రంలో ఉన్నా కార్మికుల పక్షాన నిలిచే సంఘం టీబీజీకేఎస్ మాత్ర మేనని యూనియన్ ఆర్జీ-2 వైస్ ప్రెసిడెంట్ అయిలి శ్రీనివాస్ అన్నా రు.
మహారాష్ట్రలో బీజేపీ అఖండ విజయం సాధించడంపై శనివారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బీజేపీ రామగుండం ఇన్చార్జి కందుల సంధ్యా రాణి, రాష్ట్ర నాయకులు మేరుగు హన్మంతుగౌడ్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు.
రామగుండం అభివృద్ధికి పకడ్బందీ ప్రణాళికతోనే అడుగులు వేస్తున్నామని ఎమ్మె ల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ పేర్కొన్నారు.
ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇస్తుండడంతో రైతులకు అదనపు ప్రయోజనం చేకూరుతుందని, రైస్ మిల్లర్లకు సంబంధం లేకుండా ట్రక్ షీట్ జనరేట్ చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
భర్తతో గొడవపడి ఇంటి నుంచి పారిపోయి వచ్చి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిన మహిళను 100 కాల్ ద్వారా నార్కట్పల్లి పోలీసులు కాపాడారు.
గతంలో వెనుకంజలో ఉన్న దేవరకొండ ఆర్టీసీ డిపో ఆదాయంలో నల్లగొండ రీజనల్లోనే రెండోస్థానంలో నిలిచింది. దేవరకొండ డిపోలో 110 బస్సులకుగాను 103 బస్సులు నడుస్తున్నాయి.
మూసీ నది ప్రక్షాళన జరిగితేనే నదీ పరివాహక ప్రాం తాల్లో మానవమనుగడ సాధ్యమవుతుంద ని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.