Home » Telangana » Warangal
Telangana: ములుగు జిల్లా మేడారం అడవుల్లో ఘోర విపత్తుపై ప్రభుత్వానికి అటవీ రక్షణ ప్రధానాధికారి డోబ్రియాల్ని వేదిక ఇచ్చారు. క్లౌడ్ బరస్ట్ వల్లే ఈ విపత్తు సంభవించిందని... మేఘాలు కిందకు వచ్చి బరస్ట్ కావడంతోనే చెట్లు నేలకూలాయని తెలిపారు. 3 కిలోమీటర్ల పొడవు, 2 కిలో మీటర్ల వెడల్పులో 204 హైక్టార్లలో 50వేల చెట్లు కూలాయన్నారు.
వరదపై రాజకీయాలు చేయకుండా తక్షణమే భాదితులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. వరద బాధితులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.
విద్యుత్ మీటర్లు లేని నిరుపేదలకు విద్యుత్ సంస్థ (ఎన్పీడీసీఎల్) సువర్ణ అవకాశం కల్పిస్తోంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు జీఎస్టీతో కలిపి రూ.937లకే గృహాలకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు నిర్ణయిం చారు. ఈ నేపథ్యంలో ఈనెల 1వ తేదీ నుంచి విద్యుత్ సిబ్బంది గ్రామాల్లో తిరిగి ఇళ్లకు మీటరు లేని నిరుపేదలను గుర్తించి దరఖాస్తు చేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు.
పల్లెల్లో పారిశుధ్యం లోపిస్తోంది. గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడం, ప్రత్యేకాధికారులు పట్టించుకోకపోవడంతో చెత్తాచెదారం, మురుగునీరు పేరుకుపోతోంది. దీంతో దోమలు, ఈగలు విజృంభిస్తున్నాయి. అసలై వర్షాకాలం.. ఆపై పారిశుఽధ్య లోపం కారణంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గ్రామాల్లో చాలా మంది సీజనల్ వ్యాఽధులతో సతమతమవుతున్నారు.
ఈ ఏడాది జనగామ మెడికల్ కాలేజీ నిర్మాణ పనుల్లో ఏ మార్పు లేదు. ఆగుతూ సాగుతూ జరుగుతుండ టంతో తాత్కాలిక షెడ్లలోనే తరగతులు నిర్వహించా ల్సిన దుస్థితి. పనులు వేగవంతం చేయడంలో అధికారులు అలసత్వం వీడడం లేదు. కాలేజీ నిర్మాణ పనులు మొదలుపెట్టి ఏడాది అవుతున్నా ఇంకా పిల్లర్ల దశలోనే ఉన్నాయి. జనగామ మెడికల్ కాలేజీని ఎన్ఎంసీ గత ఏడాది 100 సీట్లతో అనుమతిని ఇచ్చింది.
విద్యుత్ శాఖ ఆధునీకత వైపు పయనం ప్రారంభించింది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పునికిపుచ్చుకుంది. విద్యుత్ సమస్యలకు చెక్ పెట్టడమే కాకుండా వినియోగదారులకు నాణ్యమైన కరెంటు సరఫరా అందించేందుకు తెలంగాణ రాష్ట్ర నార్తర్న్ పవర్ డిస్ర్టిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీ ఎన్పీడీసీఎల్) కొత్త టెక్నాలజీకి శ్రీకారం చుట్టింది.
Telangana: మేడారంలో 500 ఎకరాల్లో చెట్లు నేలకొరగడంపై మంత్రి సీతక్క ఆరా తీశారు. రాష్ట్ర సచివాలయం నుంచి పీసీసీఎఫ్, డీఎఫ్ఓలతో టెలిఫోన్లలో మంత్రి మాట్లాడారు. రెండు రోజుల క్రితమే చెట్లు నేలకొరిగిన ప్రాంతాన్ని సీతక్క సందర్శించారు. లక్ష చెట్ల వరకు నేలకూలడం పట్ల మంత్రి విస్మయం చెందారు. ఈ స్థాయిలో అటవీ విధ్వంసం జరగడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
జిల్లా కేంద్రం భూపాలపల్లిలో కబ్జాల పర్వం కొనసాగుతోంది. చెరువులు, పంట కాల్వలు ఒక్కొ క్కటిగా మాయమవుతున్నాయి. చూస్తూ చూస్తుండగానే వెంచర్లు, కట్టడాలు వెలుస్తున్నాయి. కలెక్టరేట్‌కు కూత వేటు దూరంలోని గోరంట్లకుంట శిఖం భూములు పూర్తిగా అన్యాక్రాంతమయ్యాయి.
Telangana: ప్రకృతి ప్రకోపం చూపించిందని.. అత్యంత దురదృష్టమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాలోని సీతారాంనాయక్ తండాలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న కొంత ఆస్తి నష్టం జరిగిందన్నారు. కొంత ప్రాణ నష్టం జరిగిందని తెలిపారు.
Telangana: భారీ వర్షాల నేపథ్యంలో భాగంగా మహబూబాబాద్ ఆర్ఎన్బీ గెస్ట్ హౌస్‌లో వివిధ శాఖల అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వర్షాల ప్రభావం వల్ల రైతులకు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.