Share News

Etala Rajender : వరదపై రాజకీయాలు చేయొద్దు.. ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 06 , 2024 | 10:08 PM

వరదపై రాజకీయాలు చేయకుండా తక్షణమే భాదితులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. వరద బాధితులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.

Etala Rajender : వరదపై రాజకీయాలు  చేయొద్దు..  ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

మహబూబాబాద్: వరదపై రాజకీయాలు చేయకుండా తక్షణమే భాదితులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. వరద బాధితులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో ఈరోజు(శుక్రవారం)ఈటల రాజేందర్ పర్యటించారు.


ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఈటల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ.. పంట నష్టం అంచనా వేయడంలో అధికార యంత్రాంగం విఫలం అయిందని ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం విపత్తు నిధి కింద రూ. 1360 కోట్లు ఇచ్చిందని గుర్తుచేశా రు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఈటల రాజేందర్ కోరారు.


రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. చెరువుల ఆనకట్టలు తెగి చేపలు కొట్టుకుపోవడంతో మత్స్యకారులకు జీవనోపాధి కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేసి వారిని ఆదుకోవాలని కోరారు. గ్రామాల్లో కొట్టుకుపోయిన రహదారులకు వెంటనే మరమ్మతులు చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

Updated Date - Sep 06 , 2024 | 10:30 PM