Seethakka: లక్ష చెట్లు నేలకూలడంపై మంత్రి సీతక్క విస్మయం
ABN , Publish Date - Sep 04 , 2024 | 03:06 PM
Telangana: మేడారంలో 500 ఎకరాల్లో చెట్లు నేలకొరగడంపై మంత్రి సీతక్క ఆరా తీశారు. రాష్ట్ర సచివాలయం నుంచి పీసీసీఎఫ్, డీఎఫ్‌ఓలతో టెలిఫోన్లలో మంత్రి మాట్లాడారు. రెండు రోజుల క్రితమే చెట్లు నేలకొరిగిన ప్రాంతాన్ని సీతక్క సందర్శించారు. లక్ష చెట్ల వరకు నేలకూలడం పట్ల మంత్రి విస్మయం చెందారు. ఈ స్థాయిలో అటవీ విధ్వంసం జరగడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ములుగు, సెప్టెంబర్ 4: మేడారంలో 500 ఎకరాల్లో చెట్లు నేలకొరగడంపై మంత్రి సీతక్క (Minister Seethakka) ఆరా తీశారు. రాష్ట్ర సచివాలయం నుంచి పీసీసీఎఫ్, డీఎఫ్‌ఓలతో టెలిఫోన్లలో మంత్రి మాట్లాడారు. రెండు రోజుల క్రితమే చెట్లు నేలకొరిగిన ప్రాంతాన్ని సీతక్క సందర్శించారు. లక్ష చెట్ల వరకు నేలకూలడం పట్ల మంత్రి విస్మయం చెందారు. ఈ స్థాయిలో అటవీ విధ్వంసం జరగడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Minister Ponguleti Srinivasa Reddy: వరదల కారణంగా భారీగా నష్టపోయిన రైతులు
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ములుగు అడవుల్లో సుడిగాలి వల్ల లక్ష చెట్ల వరకు నేలకొరిగాయన్నారు. వందల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని తెలిపారు. వృక్షాలు కూలడంపై విచారణకు ఆదేశించామన్నారు. డ్రోన్ కెమెరాల సహాయంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. అడవిలో సుడిగాలి వచ్చింది కాబట్టి ప్రాణనష్టం జరగలేదన్నారు. ఈ సుడిగాలి గ్రామాల్లో సంభవించి ఉంటే పెను విధ్వంసం జరిగేదన్నారు.
Pawan Kalyan: నేను బయటకొస్తే సహాయ చర్యలకు ఆటంకం: డిప్యూటీ సీఎం పవన్..
సమక్క సారలమ్మ తల్లుల దయ వల్లే సుడిగాలి ఊర్ల మీదకు రాలేదన్నారు. తల్లుల దీవేనతోనే ప్రజలకు సురక్షితంగా బయటపడగలిగారన్నారు. చెట్లు నేలకూలడంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రం నుంచి పరిశోధన జరిపించి కారణాలు గుర్తించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. అటవీ ప్రాంతంలో చెట్లను పెంచేలా ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని సీతక్క వినతి చేశారు.
ఇవి కూడా చదవండి...
B.Venkat: కేంద్రం తక్షణమే వరద సాయం అందించాలి
BRS: వరద బాధితులకు బీఆర్‌ఎస్ భారీ విరాళం... ఒక నెల జీతం మొత్తం..
Read Latest Telangana News And Telugu News