Share News

Chinta mohan: చంద్రబాబుకు బెయిల్ రావడం చాలా సంతోషంగా ఉంది

ABN , First Publish Date - 2023-10-31T12:10:11+05:30 IST

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ( Skill Development Case)లో 53 రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ( Nara Chandrababu Naidu ) కి బెయిల్ లభించింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ( AP High Court ) ఈ మేరకు ఆదేశాలిచ్చింది. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడం చాలా సంతోషంగా ఉందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ( Chinta mohan ) అన్నారు.

Chinta mohan: చంద్రబాబుకు బెయిల్ రావడం చాలా సంతోషంగా ఉంది

ఢిల్లీ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ( Skill Development Case)లో 53 రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ( Nara Chandrababu Naidu ) కి బెయిల్ లభించింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ( AP High Court ) ఈ మేరకు ఆదేశాలిచ్చింది. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడం చాలా సంతోషంగా ఉందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ( Chinta mohan ) అన్నారు. మంగళవారం నాడు ఢిల్లీలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘నాకు కొన్ని అనుమానాలు వస్తున్నాయి.. బీజేపీ, వైసీపీ పార్టీలు కలిసి మళ్లీ ఏదో ఒక కేసులో చంద్రబాబును అరెస్టు చేస్తారేమోనని ఆందోళన కలుగుతోంది. 49 సంవత్సరాలుగా నాకు తెలిసిన మిత్రుడు బయటికి రావడం చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు అక్రమ అరెస్టు వెనుక బీజేపీ పార్టీ హస్త ముంది. సూరత్ కేసులో ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీని ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టారో చంద్రబాబును కూడా అలాగే ఇబ్బంది పెడుతున్నారు’’ అని చింతా మోహన్ అన్నారు.

Updated Date - 2023-10-31T12:10:11+05:30 IST