KA Paul: భూ హక్కుల చట్టం-2023 నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి
ABN , Publish Date - Dec 23 , 2023 | 02:33 PM
ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం-2023 నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వం ( YCP Govt ) వెంటనే వెనక్కి తీసుకోవాలని చట్టాన్ని రద్దు చేయకపోతే న్యాయపోరాటం చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ( KA Paul ) వ్యాఖ్యానించారు. శనివారం నాడు ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రుల హక్కుల కోసం న్యాయవాదులు పోరాటం చేస్తున్నారని చెప్పారు. స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విఫలం అయ్యారని కేఏ పాల్ ఎద్దేవా చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం-2023 నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వం ( YCP Govt ) వెంటనే వెనక్కి తీసుకోవాలని చట్టాన్ని రద్దు చేయకపోతే న్యాయపోరాటం చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ( KA Paul ) వ్యాఖ్యానించారు. శనివారం నాడు ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రుల హక్కుల కోసం న్యాయవాదులు పోరాటం చేస్తున్నారని చెప్పారు. స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విఫలం అయ్యారని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో ఘోరంగా విఫలమయ్యారని చెప్పారు. ఏపీలో భూ హక్కుల చట్టం ద్వారా కోట్ల విలువైన భూములు కాజేయాలనే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ హక్కుల చట్టంపై ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.