Kollu Ravindra: రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైంది
ABN , First Publish Date - 2023-09-19T16:38:05+05:30 IST
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అక్రమ అరెస్టును ప్రపంచం మొత్తం ప్రశ్నిస్తుందని మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర(Kollu Ravindra) అన్నారు.
ఏలూరు: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అక్రమ అరెస్టును ప్రపంచం మొత్తం ప్రశ్నిస్తుందని మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర(Kollu Ravindra) అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంగళవారం నాడు కైకలూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ బీసీ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలకు కొల్లు రవీంద్ర సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘చంద్రబాబు నాయుడుని అక్రమ అరెస్ట్ చేయడం సీఎం జగన్ మోహన్‌రెడ్డి చేసిన దుర్మార్గపు చర్య. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు.చంద్రబాబు నాయుడు నిజాయితీని ప్రపంచం మొత్తం వెలుగెత్తి చాటుతుంది. అగ్ర దేశం అమెరికాతో పాటు ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారందరూ రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిలదీస్తున్నారు.టీడీపీ శ్రేణులను గృహనిర్బంధం చేసి వైసీపీ ప్రభుత్వం ఆనందం పొందుతుంది. రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైంది. విజయవాడ, గుంటూరుతో పాటు హైదరాబాదులోనూ మహిళలు స్వచ్ఛందంగా వచ్చి చంద్రబాబుకు మద్దతు ప్రకటిస్తున్నారు.
టీడీపీ నాయకులు దేవాలయాలకు వెళ్లి పూజలు చేయాలన్న గృహనిర్బంధాలు చేస్తున్నారు. దేవాలయాల్లో ఉన్న దేవుళ్లు దీవిస్తే వైసీపీ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోతుందని సీఎం జగన్ భయపడుతున్నారు. పోలీసులను తనకు అనుకూలంగా ఉన్న వారిని అడ్డుపెట్టుకుని సీఎం జగన్ తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు. ఒక్క వైసీపీ నాయకుడు కూడా రోడ్డు మీదకు రాకుండా తిరగబడే రోజులు ఎంతో దూరంలో లేవు. ఆంధ్ర ప్రజల తిరుగుబాటు శక్తి ఏంటో చూపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. సీఎం జగన్‌కు దమ్ముంటే ప్రజల్లోకి లేదా మీడియా ముందుకు వచ్చి వాస్తవాలను మాట్లాడాలి. ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే వరకు వైసీపీతో పోరాడుతూనే ఉంటాం’’ అని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.