Kollu Ravindra: వారాహి యాత్రపై దాడికి వైసీపీ రౌడీ మూకల కుట్ర
ABN , First Publish Date - 2023-10-04T16:44:33+05:30 IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నాలుగో విడత చేపట్టిన వారాహి యాత్ర(Varahi Yatra)పై పోలీసుల కనుసనల్లోనే వైసీపీ రౌడీ మూకలు దాడికి కుట్ర పన్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) ఆరోపించారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నాలుగో విడత చేపట్టిన వారాహి యాత్ర(Varahi Yatra)పై పోలీసుల కనుసనల్లోనే వైసీపీ రౌడీ మూకలు దాడికి కుట్ర పన్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) ఆరోపించారు. బుధవారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ఈ రోజు పెడన నియోజవర్గంలో జరగబోయే వారాహియాత్రపై వైసీపీ మూకలు దాడి చేసే యత్నాన్ని ముందుగానే పోలీసులకు పవన్ కళ్యాణ్ సమాచారం ఇచ్చారు. గతంలో జరిగిన దాడులను దృష్టిలో పెట్టుకొని తన దగ్గర ఉన్న సమాచారంతో పోలీసులకు సమాచారం ఇస్తే తిరిగి వారికే నోటీసులు ఇవ్వడం దౌర్భాగ్యం. ప్రజాస్వామ్యం ఎటు పోతుంది. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పోలీసులు వ్యవహరించిన వ్యవహార శైలి ప్రస్తుత కడనలో జరగబోయే యాత్రలో అనుసరిస్తారని అనుమానాలు ఉన్నాయి. స్థానిక డీఎస్పీకి దాడికి సంబంధించి సమాచారం ఇస్తే తిరిగి సమాచారం ఇచ్చిన వారికే నోటీసులు ఇవ్వడం ప్రజాస్వామ్యనికే సిగ్గుచేటు. వారాహి యాత్రపై దాడికి సంబంధించి ముందుగా సమాచారం ఇస్తే మీ దగ్గర రిపోర్ట్స్ ఏం ఉన్నాయని డీఎస్పీ ప్రశ్నించారు. పెడనలో వైసీపీ మూకలు జనసేన పార్టీ ఫ్లెక్సీలు చింపితే దానికి మీరు ఏమని బదులిస్తారని పోలీస్‌లు ప్రశ్నించారు. తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుల సహనాన్ని ఆసరాగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నాను. పెడన బహిరంగ సభలో కవ్వింపు చర్యలకు పాల్పడితే దానికి దీటుగానే బదులిస్తాం. పోలీసులు వైసీపీ గుండాలను ప్రోత్సహిస్తే రాబోయే రోజుల్లో పోలీస్ స్టేషన్లను ముట్టడించడానికి అయినా సిద్ధమవుతాం’’ అని కొల్లు రవీంద్ర హెచ్చరించారు.