Raghurama: వైసీపీ వ్యవస్థలను మేనేజ్ చేస్తోంది
ABN , First Publish Date - 2023-09-28T14:36:26+05:30 IST
ఏపీలో లేనిది ఉన్నట్టు - ఉన్నది లేనట్టు వైసీపీ ప్రభుత్వం(YCP Govt) చూపిస్తోందని ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) వ్యాఖ్యానించారు.
ఢిల్లీ: ఏపీలో లేనిది ఉన్నట్టు - ఉన్నది లేనట్టు వైసీపీ ప్రభుత్వం(YCP Govt) చూపిస్తోందని ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) వ్యాఖ్యానించారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్న కూడా కనిపించడం లేదు అంటున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ఆలోచన రూపంలో మాత్రమే ఉంది. లేని ఇన్నర్ రింగ్ రోడ్డులో ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. లేని ఇన్నర్ రింగ్ రోడ్డులో నారా లోకేష్ పేరు ఎలా పెడతారు. గుంటూరు - విజయవాడ ఎప్పటి నుంచో ఉన్న ప్రధాన నగరాలు. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తారని వైసీపీ నేతలు గతంలో మాట్లాడేవారు. చంద్రబాబు నాయుడు 20 రోజుల నుంచి జైల్లో ఉన్నారు. అంటే ఇప్పుడు వైసీపీ నేతలు వ్యవస్థలను మేనేజ్ చేశారని అనుకోవచ్చా ? న్యాయమూర్తికి ఏదనిపిస్తే అది చేస్తారు..న్యాయ వ్యవస్థను ఎవరు మేనేజ్ చేయలేరు.
న్యాయ వ్యవస్థపై దాడి చేయడం మంచిది కాదు. అన్యాయంగా చంద్రబాబు నాయుడును జైల్లో పెట్టారు. వచ్చే వారం చంద్రబాబునాయుడు బయటకు రావాలని కోరుకుంటున్నాను. ఎంఎస్ స్వామినాథన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మద్యం నియంత్రణపై జగన్ మాట మార్చారు. మద్యంపై ఏడాదికి 91 వేల కోట్లు ఆదాయం వస్తోంది. మద్యం నిషేధం అన్నారు. మహిళలను దారుణంగా జగన్ మోసం చేశారు. మహిళలు మేల్కొవాలి. మద్యంపై వైసీపీ ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారు. ఒక్కసారని చెప్పి జగన్ అధికారంలోకి వచ్చారు. ఒక్క రూపాయి జీతం అని చెప్పి ప్రత్యేక విమానాలు వాడుతున్నారు. మద్యంలో వైసీపీ నేతలు 2లక్షల కోట్ల రూపాయలు అవీనితి చేశారు. చెత్తపన్ను మాత్రం ఆన్‌లైన్‌లో తీసుకుంటున్నారు. ఇసుక, మద్యం నో ఆన్‌లైన్ ఎందుకో జగన్మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలి?’’ అని రఘురామ పేర్కొన్నారు.