Sajjala: తొక్కిసలాట మరణాల వల్లే కొత్త జీవో
ABN , First Publish Date - 2023-01-03T16:08:00+05:30 IST
సభలు, రోడ్డు షోలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా తప్పుపట్టాయి. ప్రతిపక్షాల గొంతునొక్కేందుకే ప్రభుత్వం జీవో తెచ్చిందని విపక్షాలు
అమరావతి: సభలు, రోడ్డు షోలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా తప్పుపట్టాయి. ప్రతిపక్షాల గొంతునొక్కేందుకే ప్రభుత్వం జీవో తెచ్చిందని విపక్షాలు ధ్వజమెత్తాయి. ప్రతిపక్షాల ఆరోపణలపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే... ‘‘రోడ్డు షోలపై ఆంక్షల జీవో ఎందుకు వచ్చిందో ప్రపంచంలో అందరికీ తెలుసు. చంద్రబాబు కందుకూరు (Kandukur) సభలో తొక్కిసలాట మరణాల వల్లే ఈ జీవో వచ్చింది. ప్రభుత్వ (ycp government) నిర్ణయాలను తప్పు పడితే ఎలా? ఈ జీవో కేవలం విపక్షాలకే కాదు... వైసీపీ (ycp)కీ వర్తిస్తుంది. ప్రత్యేకంగా వైసీపీకి అనుమతి ఇచ్చే అవకాశం ఉందా? అని విలేఖర్లు ప్రశ్నించారు. వైసీపీకి అలా అనుమతిస్తే మిగిలిన పార్టీలు కూడా అడగచ్చు. జీవోలపై కోర్టుకు వెళ్లే హక్కు అందరికీ ఉంటుంది. లోకేష్ పాదయాత్ర , పవన్ బస్సు యాత్ర కోసం జీవో తెచ్చారనేది వాళ్ల ఊహ. లోకేష్ (Nara lokesh), చంద్రబాబు (Chandrababu), పవన్(Pawan Kalyan) జనంలో ఉండాలనేదే మా అభిప్రాయం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కేసీఆర్ (Cm kcr) మద్దతు ఇస్తే మంచిదే. మేం కూడా అదే కోరుకుంటున్నాం. కొత్త పార్టీలు వస్తే మంచిది. బీఆర్‌ఎస్ (BRS)లోకి వెళ్లడానికి 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు (TDP MLAS) రెడీగా ఉన్నారా ?.’’ అని సజ్జల ప్రశ్నించారు.