Bonda Uma చంద్రబాబుకు హైకోర్టు ఇంటీరియమ్ బెయిల్ మంజూరు చేసింది
ABN , First Publish Date - 2023-10-31T14:49:21+05:30 IST
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) కు ఏపీ హైకోర్టు ( AP High Court ) ఇంటీరియమ్ బెయిల్ మంజూరు చేసిందని ఆ పార్టీ నేత బోండా ఉమామహేశ్వరరావు ( Bonda Umamaheswara Rao ) అన్నారు.
విజయవాడ: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) కు ఏపీ హైకోర్టు ( AP High Court ) ఇంటీరియమ్ బెయిల్ మంజూరు చేసిందని ఆ పార్టీ నేత బోండా ఉమామహేశ్వరరావు ( Bonda Umamaheswara Rao ) అన్నారు. మంగళవారం నాడు ఏసీబీ కోర్టు వద్ద బోండా ఉమా మీడియాతో మాట్లాడుతూ...‘‘ఏసీబీ కోర్టులో లక్ష రూపాయల కు రెండు షూరిటీలు పెట్టి.. పూచికత్తు ఇచ్చాం. నిబంధనలు పాటిస్తారా అని న్యాయమూర్తి అడిగారు. అన్నింటినీ పాటిస్తామని న్యాయమూర్తికి విన్నవించాం.మెయిల్ ద్వారా రాజమండ్రి జైలుకు బెయిల్ ఆదేశాలు పంపారు. రిలీజ్ ఆర్డర్ కాపీ నేరుగా మాకు ఇచ్చారు. 52 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండి.. నేడు బయటకి వస్తున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబుపై జగన్ అక్రమ కేసులు పెట్టారు. న్యాయస్థానంలో వీటిపై మా పోరాటం సాగుతుంది. సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్, హైకోర్టు రెగ్యులర్ బెయిల్ విచారణ సాగుతుంది. సుప్రీంకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు ఉంటుందని భావిస్తున్నాం. జగన్ తప్పుడు ఆధారాలతో జ్యుడీషియల్ రిమాండ్ పెట్టించాడు. చంద్రబాబుపై ఒక్క ఆధారం కూడా చూపించలేదు. కేవలం జగన్ కక్షతో రాజకీయ క్రీడలో భాగంగా చంద్రబాబును అక్రమ అరెస్టు చేయించారు. ప్రివెంటీవ్ ఆఫ్ కరెప్షన్ అంటే 43వేల కోట్లు దోచుకున్న జగన్‌పై పెట్టాలి. 370 కోట్లు నుంచి 27 కోట్లు పార్టీ ఫండ్ దోచినట్లు చంద్రబాబుపై అభియోగం మోపారు. న్యాయం, ధర్మం గెలిచింది.. చంద్రబాబు బయటకి వస్తారు. జగన్ పెట్టిన కేసులు, వేధింపులపై ప్రతిచర్య తప్పకుండా ఉంటుంది. న్యాయస్థానాల ద్వారా జగన్‌కు శిక్షలు పడేలా చూస్తాం’’ అని బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.