Devineni Uma: శ్రీలంక అధ్యక్షుడి మాదిరిగానే జగన్‌రెడ్డిని తరిమికొట్టడం ఖాయం
ABN , First Publish Date - 2023-09-20T19:07:29+05:30 IST
శ్రీలంక అధ్యక్షుడి మాదిరిగానే సీఎం జగన్‌రెడ్డి(CM Jagan Reddy)ని తరిమికొట్టడం ఖాయమని మాజీమంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) తీవ్రంగా హెచ్చరించారు.
విజయవాడ: శ్రీలంక అధ్యక్షుడి మాదిరిగానే సీఎం జగన్‌రెడ్డి(CM Jagan Reddy)ని తరిమికొట్టడం ఖాయమని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) తీవ్రంగా హెచ్చరించారు. బుధవారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ఈ సైకో ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేయించి 11 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలుపాలు చేశారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా.. ఎన్ని పీటి వారెంట్లు ఇచ్చినా. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికి వస్తారు.వేల కోట్ల టర్నోవర్ గల ఐటీ కంపెనీల సీఈవోలు సైతం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు(Chandrababu Naidu illegal arrest)కు నిరసన తెలుపుతున్నారు.ఫైబర్ నెట్(Fiber net)తో నెలకు 35 కోట్ల చొప్పున 51 నెలల్లో 1785 కోట్లు జగన్‌రెడ్డి వసూలు చేశారు. అర్హత లేని ముఖ్యమంత్రి బంధువులను చైర్మన్‌గా పెట్టుకొని తప్పుడు ప్రకటన ఇప్పించి బురద చల్లాలని ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్‌ని కూడా అరెస్టు చేయాలని ఈసైకో చూస్తున్నారు. పిల్లసైకో సజ్జల రామకృష్ణారెడ్డి డబ్బులు లెక్కేస్తుంటే.. కొడుకు భార్గవ్ సోషల్ మీడియాలో దుర్మార్గపురాతలు రాస్తున్నాడు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా నిన్ను నీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు’’ అని దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా హెచ్చరించారు.