Devineni Uma: మీడిసిపడమాకు జగన్రెడ్డి.. త్వరలోనే ప్రజలు నిన్ను గద్దె నుంచి దించుతారు
ABN , First Publish Date - 2023-10-10T17:19:33+05:30 IST
మీడిసిపడమాకు జగన్రెడ్డి.. త్వరలోనే ప్రజలు నిన్ను ఓటు అనే ఆయుధంతో గద్దె నుంచి దించుతారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ (మైలవరం): మీడిసిపడమాకు జగన్రెడ్డి.. త్వరలోనే ప్రజలు నిన్ను ఓటు అనే ఆయుధంతో గద్దె నుంచి దించుతారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) వ్యాఖ్యానించారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుతూ మంగళవారం నాడు మైలవరం పాత మసీదులో టీడీపీ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మైలవరం దీక్ష శిబిరంలో కళ్లకు గంతలు కట్టుకొని టీడీపీ నాయకుల నిరసన తెలిపారు. టీడీపీ నాయకుల దీక్షలకు దేవినేని ఉమామహేశ్వరరావు సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ..‘‘151 సీట్లు వచ్చాయని మదం, రెండున్నర లక్షల కోట్లు దోచుకున్నానని అహంకారంతో జగన్రెడ్డి ఎగతాలిగా మాట్లాడుతున్నాడు. ప్రజలు కట్టిన పన్నుల డబ్బులను లాయర్లకు ఇచ్చి చంద్రబాబునాయుడుని ఇంకా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచాలని వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. వైసీపీ ప్రభుత్వానికి కాలం దగ్గర పడింది.
కాబట్టే నిన్న జగన్రెడ్డి మాటల్లో అహంకారం కనబడింది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎంత మసి పూసి మారేడు కాయ చేసిన చివరికి ధర్మం, న్యాయమే గెలుస్తుంది. ముందస్తు ఎన్నికల కోసం మూడు రోజులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అపాయింట్మెంట్ కోసం జగన్రెడ్డి పడిగాపులు కాశాడు. రైతాంగం కోసం కృష్ణా జలాలపై ప్రధాని మోదీకి వినతిపత్రం కూడా ఇవ్వలేకపోయిన చేతగాని, అసమర్ధుడు ముఖ్యమంత్రి జగన్రెడ్డి. కృష్ణా జలాలపై జగన్ మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి. కృష్ణా నీటిని పక్క రాష్ట్రం తెలంగాణకు తాకట్టు పెట్టి ఆంధ్ర రాష్ట్ర రైతంగానికి జగన్ ఉరితాడు వేశాడు. రైతంగానికి జగన్ బహిరంగ సమాధానం చెప్పాలి’’ అని దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు.