Share News

Devineni Uma: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనగా ఉంది

ABN , First Publish Date - 2023-10-13T21:35:03+05:30 IST

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) ఆరోగ్యంపై మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.

Devineni Uma: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనగా ఉంది

ఎన్టీఆర్ జిల్లా(మైలవరం): తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) ఆరోగ్యంపై మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మైలవరం దీక్షా శిబిరం వద్ద దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ శ్రేణులు. గాల్లోకి బెలూన్లు వదిలారు. 31వ రోజు రిలే నిరాహార దీక్షలో కూర్చున్న టీడీపీ నాయకులకు సంఘీభావం తెలిపి, నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. ఈ సందర్భంగా మీడియాతో దేవినేని ఉమా మాట్లాడుతూ..‘‘చంద్రబాబును ఎదుర్కొలేక జగన్‌రెడ్డి అక్రమ కేసులతో జైలుపాలు చేశారు. ఉద్దేశ్యపూర్వకంగానే రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు నాయుడును అంతమొందించేందుకు జగన్‌రెడ్డి కుట్రకు తెరలేపాడు. చంద్రబాబుకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా... ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, ప్రభుత్వానిదే బాధ్యత! కుట్ర పూరితంగా జైల్లో చంద్రబాబు నాయుడుపై విష ప్రయోగం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై సీఎం జగన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. డాక్టర్స్ సంతకం లేకుండా హెల్త్ బులెటిన్ విడుదల చేయడం కుట్రలో భాగమే. ఉన్నతమైన పదవుల్లో ఉన్న అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తే ప్రజలు సహించరు. ఉద్దేశపూర్వకంగా, పథకం ప్రకారమే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చే లోపు ఆరోగ్యాన్ని దెబ్బతీయటానికి విష ప్రయోగం చేస్తున్నారు. బాధ్యతగల ఆరోగ్య శాఖ మంత్రి అధికారులు చంద్రబాబు హెల్త్ బులిటెన్‌‌పై సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇష్టారాజ్యంగా చంద్రబాబు నాయుడుపై స్టెరాయిడ్లు ఎందుకు ప్రయోగిస్తారు ? ప్రైవేటు ఆస్పత్రికి వెంటనే షిఫ్ట్ చేయాలి వ్యక్తిగత డాక్టర్‌ను సంప్రదించాలి. ముఖ్యమంత్రి, డీజీపీ, జైలు అధికారులకు బాధ్యత లేదా ? తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. విశాఖపట్నంలో ప్రజల సొమ్ము 500 కోట్లతో జగన్‌రెడ్డి ఇంద్ర భవనం కట్టుకున్నారు’’ అని దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.

Updated Date - 2023-10-13T21:35:03+05:30 IST