Jalil Khan: ఆంధ్రప్రదేశ్‌లో చీకటి పరిపాలన
ABN , First Publish Date - 2023-09-15T21:11:34+05:30 IST
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (CM JAGAN REDDY)ఆధ్వర్యంలో చీకటి పరిపాలన కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్(Jalil Khan) పేర్కొన్నారు.తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) అక్రమ అరెస్టుకు నిరసనగా శుక్రవారం నాడు టీడీపీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ తీశారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (CM JAGAN REDDY)ఆధ్వర్యంలో చీకటి పరిపాలన కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్(Jalil Khan) పేర్కొన్నారు.తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) అక్రమ అరెస్టుకు నిరసనగా శుక్రవారం నాడు టీడీపీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో కేశినేని చిన్ని, జలీల్‌ఖాన్, టీడీపీ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జలీల్‌ఖాన్ మాట్లాడుతూ.. ‘‘కొవ్వొత్తుల ప్రదర్శన ద్వారా ప్రజలకు ఒకటే చెబుతున్నాం.వెలుతురు రావాలంటే చంద్రబాబు పాలనే రావాలి.మనం చీకటిలో ఉన్నామని చెప్పేందుకే ఈ కొవ్వొత్తులతో నిరసన చేస్తున్నాం.దేశంలోనే కాదు... అనేక దేశాల వారు కూడా చంద్రబాబు అరెస్టుపై ఆశ్చర్య పోతున్నారు.వైసీపీ ప్రభుత్వం పగ బట్టింది కాబట్టే అర్ధరాత్రి వెళా చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు వయస్సును పరిశీలనలోకి తీసుకోకుండా అర్ధరాత్రి రోడ్లపై తిప్పుతూ ఇబ్బందులు పెట్టారు. జగన్మోహన్‌రెడ్డి నీ పాపాలు పండాయి... నీకు సినిమా క్లోజ్ అయిపోయింది. దేవుడు కూడా మంచి కార్యక్రమం చేశాడు... పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో కలిసి పోరాడతామని చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం జగన్ నియంత పాలనను తరిమి కొడతాం. వైసీపీ నేతలు వైనాట్ 175అనడం కాదు... మేము వైనాట్ పులివెందుల అంటున్నాం.డ్యాన్స్‌లు చేసే వాళ్లకి, అసభ్యంగా మాట్లాడేవారికి ప్రజలు బుద్ధి చెబుతారు. ఇప్పటికే చాలా మంది వైసీపీ నేతలు పక్క రాష్ట్రాల్లో ఇళ్లు చూసుకుంటున్నారు’’ అని జలీల్‌ఖాన్ ఎద్దేవ చేశారు.