Kollu Ravindra : పిచ్చోడి చేతిలో రాయిలా ఏపీ పరిస్థితి
ABN , First Publish Date - 2023-09-15T20:49:39+05:30 IST
పిచ్చోడి చేతిలో రాయిలా ఏపీ పరిస్థితి మారిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు మచిలీపట్నంలో టీడీపీ, జనసేన(TDP, Jana Sena) ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు.
కృష్ణాజిల్లా, (మచిలీపట్నం) : పిచ్చోడి చేతిలో రాయిలా ఏపీ పరిస్థితి మారిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు మచిలీపట్నంలో టీడీపీ, జనసేన(TDP, Jana Sena) ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొల్లు రవీంద్ర, జనసేన జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘ జగన్(Jagan) కక్ష సాధింపు చర్యలపై రెండు పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ(YCP) దురాఘతాలను సమైక్యంగా ఎదుర్కొంటాం. మాట వినని అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బెదిరింపులు, చిత్రహింసలు పెడతారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు అందరూ రోడ్లెక్కారు. టీడీపీతో జత కలిసిన పవన్ కళ్యాణ్‌ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం.
పోలీసులను అడ్డం పెట్టుకుని జగన్‌రెడ్డి దురాఘతాలకు పాల్పడుతున్నారు. మైనింగ్, మద్యం పేరుతో రాష్ట్రాన్ని దోచేస్తున్నారు.యువతిని నిర్వీర్యం చేసే విధంగా రాష్ట్రంలో గంజాయిని విస్తరించారు. కార్పొరేషన్ నిధులను అటకెక్కించి ఆ వర్గాల యువత, నిరుద్యోగులను సీఎం జగన్ నష్టపరిచారు. అవినీతిని ఎండగడుతుంటే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారు. 144 సెక్షన్ పెట్టి ప్రజా ఉద్యమాన్ని అణచలేరు.టీడీపీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో అన్యాయంగా పెట్టిన కేసులను మాఫీ చేస్తాం.ఇదే కేసుల్లో జైలులో పోలీసులు ఉంటారన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. టీడీపీ, జనసేన కలయికతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల్లో భయం పట్టుకుంది.త్వరలోనే ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు సమైక్యంగా ముందుకు వెళ్తాం’’ అని వైసీపీ ప్రభుత్వం. సీఎం జగన్‌రెడ్డిపై కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.