Somireddy: కేసు మీద కేసు పెట్టాలా.. చంద్రబాబును జైల్లో పెట్టాలనేదే జగన్‌రెడ్డి లక్ష్యం
ABN , First Publish Date - 2023-11-23T17:19:59+05:30 IST
కేసు మీద కేసు పెట్టాలా.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) ను జైల్లో పెట్టాలనేదే జగన్‌రెడ్డి ( Jagan Reddy ) లక్ష్యమని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) ఎద్దేవ చేశారు.
నెల్లూరు: కేసు మీద కేసు పెట్టాలా.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) ను జైల్లో పెట్టాలనేదే జగన్‌రెడ్డి ( Jagan Reddy ) లక్ష్యమని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) ఎద్దేవ చేశారు. గురువారం నాడు తోటపల్లి గూడూరు మండలం కోడూరు వెంకన్న పాలెంలో ‘‘బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ’’ , ఇంటింటా ప్రచారం కార్యక్రమాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ...‘‘చంద్రబాబు ప్రభుత్వంలో ఇసుక ఉచితంగా ఇవ్వడం ఫైబర్ నెట్ కేవలం 145 రూపాయలకు ఇవ్వడం ఆయన చేసిన ఘోరమైన తప్పు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తలలను తాకట్టుపెట్టి అప్పు తెచ్చే పరిస్థితికి ఈ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి వచ్చాడు. అలాగే మా రాష్ట్ర ప్రజలు ఇన్నేళ్లు తాగుతారని తాకట్టు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా కరువు వచ్చింది. ఎందుకు సమీక్ష చేయరు. వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి ఎందుకు ప్రజల మధ్యకు వెళ్లరు’’ అని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు.