Share News

Somireddy : కేజీఎఫ్ మైనింగ్‌ను తలపించేలా ఏపీలో దోపిడీ

ABN , Publish Date - Dec 16 , 2023 | 10:19 PM

కేజీఎఫ్ మైనింగ్‌ను తలపించేలా ఏపీలో దోపిడీ జరుగుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) పేర్కొన్నారు.

Somireddy : కేజీఎఫ్ మైనింగ్‌ను తలపించేలా ఏపీలో దోపిడీ

నెల్లూరు: కేజీఎఫ్ మైనింగ్‌ను తలపించేలా ఏపీలో దోపిడీ జరుగుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) పేర్కొన్నారు. శనివారం నాడు పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో రుస్తుం, భారత్ మైకా మైన్ వద్ద సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నిరసనకి దిగారు.ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ..ఎలాంటి పత్రాలు లేకుండా, ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా అధికార పార్టీ బందిపోటు దొంగలు 21 రోజులుగా రోజుకు 2 వేల టన్నుల క్వార్ట్జ్ ను వెలికితీస్తున్నారు.. రోజుకి రూ.4 కోట్ల భారీ దోపిడీ జరుగుతుంది. అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకొమని ఈనెల 7వ తూదీన కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది, ఇంత వరకు అధికారులు అక్రమ మైనింగ్ ఆపకపోవడం సిగ్గుచేటు. సీఎం, మంత్రులకి ఇందులో వాటాలు ఉన్నాయి. మైన్స్, పోలీసులు అధికారులు ముందుకు రావడం లేదు.. ఓ కేసులో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఏ1 ముద్దాయి, పేర్నేటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఏ2గా ఉన్నారు. మంత్రి కాకాని, వైసీపీ నేత శ్యాంప్రసాద్‌రెడ్డిపై చర్యలు తీసుకొని రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద దోపిడీ సొమ్ము వసూలు చేయాలి. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా, తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్ పబ్జీ ఆడుతున్నాడు’’ అని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎద్దేవ చేశారు.

Updated Date - Dec 16 , 2023 | 10:19 PM