KA Paul : గతంలో జగన్‌రెడ్డిపై టీడీపీ కేసులు ఎందుకు పెట్టలేదు
ABN , First Publish Date - 2023-09-27T19:30:07+05:30 IST
గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan Reddy) అక్రమాలపై పుస్తకాలను తెలుగుదేశం పార్టీ విడుదల చేసిందని.. మరీ జగన్‌పై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) ప్రశ్నించారు.
విశాఖపట్నం: గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan Reddy) అక్రమాలపై పుస్తకాలను తెలుగుదేశం పార్టీ విడుదల చేసిందని.. మరీ జగన్‌పై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) ప్రశ్నించారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘GVL విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీచేయాలి. బీజేపీ, పవన్, టీడీపీ కలిసి ఉమ్మడిగా విశాఖ నుంచి పోటీ చేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఇప్పటికిప్పుడు ఏం చేయరని ‘GVL చెప్తున్నారు.. అంటే తర్వాత స్టీల్ ప్లాంట్‌ని అమ్మేస్తారా..? స్టీల్ ప్లాంట్‌ను పూర్తిగా అమ్మమని ప్రకటన చేయాలి. నా ఆమరణ నిరాహార దీక్ష వల్లే స్టీల్ ప్లాంట్ ఆగింది. స్టీల్ ప్లాంట్ కోసం ఒక ఎంపీ కూడా ఎందుకు రిజైన్ చేయలేదు. బీజేపీ, కాంగ్రెస్ రెండు తోడు దొంగలే. చంద్రబాబు అరెస్ట్ ఇది రాజకీయ కుట్రతో జరిగినప్పటికీ, మోదీ కరుణిస్తేనే చంద్రబాబుకి, బెయిల్ వస్తుంది. చట్టం తన పని తాను చేస్తోందంటూ బయటికి చెప్తారు. ఎవరి సహకారంతో జరుగుతుందో అందరికీ తెలుసు. ఎన్నికల ముందు నారా లోకేష్‌ని అరెస్టు చేయడం సరికాదు. విశాఖ ఎంపీగా నన్ను గెలిపిస్తేనే స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కరం అవుతుంది. స్టీల్ ప్లాంట్‌పై కేంద్రమంత్రి రూపాల కూడా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పారు’’ అని కేఏ పాల్ పేర్కొన్నారు.