Nazir: ముందస్తు ఎన్నికల ప్రణాళిక కోసం జగన్ ఢిల్లీ వెళ్లారు
ABN , First Publish Date - 2023-10-05T21:17:57+05:30 IST
ఓటమి భయంతో ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రణాళిక కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM JAGAN REDDY) ఢిల్లీ వెళ్లారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్డీ నజీర్(Nazir) అన్నారు.
విశాఖపట్నం: ఓటమి భయంతో ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రణాళిక కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM JAGAN REDDY) ఢిల్లీ వెళ్లారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్డీ నజీర్(Nazir) అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ..‘‘వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని జగన్‌కు బాగా తెలుసు. ప్రజలు కోరుకుంటున్నది టీడీపీ ప్రభుత్వమేనని ఐప్యాక్ ఇప్పటికే జగన్మోహన్‌రెడ్డికి నివేదిక ఇచ్చింది. నారా చంద్రబాబు నాయుడుపై మోపిన కేసులకు కోర్టుల్లో ఆధారాలు చూపలేకపోతున్నారు. జగన్‌కు తన పాలన మీద నమ్మకం లేదు. కేంద్రం వద్ద తన బాధలను చెప్పుకోడానికి ఢిల్లీకి వెళ్లారు. డిసెంబర్ నాటికి ఎన్నికలు పెట్టమని అడగడానికి వెళ్లారు. దసరా నుంచి ఏపీలో టీడీపీ విజయోత్సవ సభలే జరగనున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు విన్నాం. టీడీపీ బలహీనపడిందనుకుంటున్నారు. వైసీపీలో 50 నుంచి 60 మందికి టికెట్లు ఇవ్వడానికి జగన్ ఎందుకు వెనకాడుతున్నారు. సజ్జల విశాఖపట్నంలో ఎమ్మెల్యేగా పోటీ చేయగలరా...? ప్రజలు మిమ్మల్ని తిప్పికొడతారు. పదేళ్లుగా జగన్ బెయిల్ మీద ఉన్నారు. ఎదుటి వారికి బెయిల్ రాకుండా ఆపుతున్నారు. టీడీపీ నేతల కోసమే సెక్షన్ 30, 144లు పెట్టారు..ఇవి వైసీపీ నేతలకు ఎందుకు వర్తించడంలేదు. ఇక ఎంతో కాలం వైసీపీ ప్రభుత్వం ఉండదు’’ అని ఎమ్డీ నజీర్ పేర్కొన్నారు.