TDP: ‘నా వ్యాఖ్యలను మార్ఫింగ్ చేస్తున్నారు’.. సజ్జల కుమారుడిపై అనిత ఫిర్యాదు

ABN , First Publish Date - 2023-03-11T12:21:45+05:30 IST

వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత ...

TDP: ‘నా వ్యాఖ్యలను మార్ఫింగ్ చేస్తున్నారు’.. సజ్జల కుమారుడిపై అనిత ఫిర్యాదు

విశాఖపట్నం: వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డి (YCP Government Advisor Sajjala Ramakrishna Reddy son of Bhargaon Reddy) పై టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత (TDP State Women President Anitha) విశాఖ సైబర్ క్రైమ్ పోలీసుల (Visakha Cyber Crime Police)కు ఫిర్యాదు చేశారు. సజ్జల కుమారుడు తన వ్యాఖ్యలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబును గద్దె దింపాలని, జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని తాను అనలేదని.. ఇలాంటి వ్యాఖ్యలను ఎడిట్ చేయడం దారుణమని మండిపడ్డారు. ఇది మహిళా దినోత్సవం రోజు సాక్షి ఛానల్‌లో కూడా ప్రసారం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా (Chittoor District)లో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఈ విషయంపై తమ నియోజకవర్గం పాయకరావుపేటలో కూడా ఫిర్యాదు చేసినట్లు టీడీపీ నేత చెప్పారు.

వైసీపీ నేతలు (YCP Leaders) పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ఎవరైనా నిలదీస్తే వారిపై కేసులు పెడతారని... తమపై ఇష్టనుసారంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే ఫిర్యాదు మాత్రం తీసుకోరని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందన్నారు. దిశ పీఎస్ పెట్టారని... అసలు దిశ చట్టం ఉందా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి‌ (YS Jaganmohan Reddy) కి పరదాలు కప్పడానికేనా పోలీసులు ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు అనిత డిమాండ్ చేశారు.

Updated Date - 2023-03-11T12:21:49+05:30 IST