Dharmana Prasad Rao: ఎన్నికల ముందు చంద్రబాబుపై జగన్‌రెడ్డి ఏం కక్ష సాధించడం లేదు
ABN , First Publish Date - 2023-10-07T19:29:10+05:30 IST
ఎన్నికల ముందు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడుపై సీఎం జగన్మోహన్‌రెడ్డి ఏం కక్ష సాధించడం లేదని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాధరావు(Dharmana Prasad Rao) వ్యాఖ్యానించారు.
శ్రీకాకుళం: ఎన్నికల ముందు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడుపై సీఎం జగన్మోహన్‌రెడ్డి ఏం కక్ష సాధించడం లేదని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాధరావు(Dharmana Prasad Rao) వ్యాఖ్యానించారు. శనివారం నాడు మంత్రి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘చంద్రబాబు కేసులు ఇన్‌కంట్యాక్స్, ఈడీ వంటి కేంధ్ర సంస్దలే మెదట ధర్యాప్తు చేశాయి. జర్మనీలో ఉన్న సీమెన్స్ సంస్ద పేమెంట్ జరిగినట్లు నాటి ప్రభుత్వం చెబుతోంది. సీఐడీ అధికారులు సీమెన్స్ సంస్థను ప్రశ్నిస్తే ఎలాంటి అగ్రిమెంట్, పేమెంట్ జరగలేదని చెప్పి అఫిడవిట్ ఇచ్చింది. దేశంలో కొన్ని కంపెనీలు పెట్టి, డబ్బులు పంపడానికి మాత్రమే ఉపయోగించే సెల్ కంపెనీలను చంద్రబాబు పెట్టారు.
ధర్యాప్తులో ఇద్దరు వ్యక్తులకే మెత్తం డబ్బులు వెల్లాయి. ఆ ఇద్దరు ఒకరు చంద్రబాబు పీఏ , ఇంకొకరు లోకేష్ పీఏ. ఎలాంటి సిస్టమ్ కూడా పాటించలేదు. మాజీ ముఖ్యమంత్రి, గౌరమైన వ్యక్తి అంటూ వదిలేయ మంటే ఎలా ? అలా వదిలేసే హక్కు ప్రభుత్వానికి లేదు. ఇందిరా గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్ , జయలలిత , పీవీ నరసింహారావు ఇలా ఎంతోమంది కేసులును కోర్టుల్లో ఎదుర్కొన్నారు. ముద్దాయి దోషి అవునా కాదా అన్నది కోర్టు తెలుస్తుంది. కోర్టులోనే చంద్రబాబు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. ప్రతి కుటుంబం ఆరోగ్యం, విద్యా , ఉండటానికి ఇంటిని జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్మిస్తోంది. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న విద్యాను ఇంకో పదిహేనేళ్లు కొనసాగిస్తే దేశంలొ నెంబర్ వన్‌గా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది. వైసీపీ ప్రభుత్వంలో అవినీతిని కంట్రోల్ చేశాం. భూమి పత్రాలను పూర్తిగా రీసర్వే చేస్తున్నాం’’ అని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.