Chandrababu: దేశంలో పట్టిసీమలాంటి ప్రాజెక్టు లేదు
ABN , First Publish Date - 2023-08-07T16:22:34+05:30 IST
దేశంలో పట్టిసీమ(Pattiseema)లాంటి పెద్ద ప్రాజెక్టు లేదని.. ఇక మీదట ఏపీలో వస్తుందన్న నమ్మకం లేదు.. అటువంటి కీలకమైన ప్రాజెక్టుని వైసీపీ ప్రభుత్వం( YCP Govt) నిర్వీర్యం చేస్తోందని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అన్నారు.
ఏలూరు: దేశంలో పట్టిసీమ(Pattiseema)లాంటి పెద్ద ప్రాజెక్టు లేదని.. ఇక మీదట ఏపీలో వస్తుందన్న నమ్మకం లేదు.. అటువంటి కీలకమైన ప్రాజెక్టుని వైసీపీ ప్రభుత్వం(
YCP Govt) నిర్వీర్యం చేస్తోందని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అన్నారు. సోమవారం పట్టిసీమపై పవర్ పాయింట్ ప్రజంటేషన్(Power point presentation) చేశారు.ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. చేతకాని వైసీపీ ప్రభుత్వం వల్ల పట్టిసీమకు ఎంతో నష్టం వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేథావులు, ప్రజలు, రైతుల్లో అవగాహన తీసుకురావడానికే తన ప్రయత్నమని చెప్పారు. కరువు నివారించడానికి కాటన్ దొర ధవళేశ్వరం బ్యారేజ్(Cotton Dora Dhavaleswaram Barrage) కట్టారు.. అందుకే ఆయన విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అయిదు ప్రధాన నదులు, 69 ఉపనదులు ఉన్నాయని.. దేశంలో ఏ ప్రాజెక్టులోనూ లేని నీళ్లు ఏపీలో ఉన్నాయని వాటిని సక్రమంగా వినియోగిస్తే రైతులకు ఎంతో మేలు చేస్తుందని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు(Polavaram project0) ఇతర నదులతో అనుసంధానించాలని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చంద్రబాబు ప్రభుత్వాన్ని వివరణ కోరారు.
వైసీపీ ప్రభుత్వానికి చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్
చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు(Chintalapudi Lift Irrigation Project) వద్ద టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సెల్ఫీ ఛాలెంజ్(Selfie Challenge) విసిరారు.గత ప్రభుత్వ హయాంలో రూ. 4909 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. టీడీపీ హయాంలోనే రూ. 2289 కోట్లు ప్రాజెక్టు కోసం ఖర్చు చేశామన్నారు.ఉమ్మడి పశ్చిమ, కృష్ణా జిల్లాల పరిధిలో 4.80 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రాజెక్టు రూపకల్పన చేసినట్లు చెప్పారు.53 టీఎంసీల గోదావరి వరద జలాలను తరలించేలా ప్రణాళిక చేశామన్నారు. ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం అటకెక్కించడంపై ప్రశ్నిస్తూ చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. చింతలపూడి ఎందుకు పూర్తి చేయలేక పోయారో చెప్పాలని సీఎం జగన్‌రెడ్డిని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.