Nara Lokesh: జగన్ పాలనలో యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:30 PM
గన్మోహన్‌రెడ్డి ( JAGAN ) పాలనలో యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) పేర్కొన్నారు.
అనకాపల్లి జిల్లా: జగన్మోహన్‌రెడ్డి ( JAGAN ) పాలనలో యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) పేర్కొన్నారు. ఆదివారం నాడు పెందుర్తి నియోజకవర్గం గొర్లవానిపాలెం జీజే కాలేజీ వద్ద బోనంగి, లెమర్తి, తాడి, తానం గ్రామాల నిరుద్యోగ యువకులతో లోకేష్ ముచ్చటించారు. యువతకు ఉద్యోగాలివ్వడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఫ్లకార్డులతో ప్రదర్శించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ...‘‘జగన్ చేతగాని పాలనతో 28శాతం నిరుద్యోగిత రేటుతో ఏపీని దేశంలోనే నెం.1 స్థానంలో నిలిపాడు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చాక 2.30లక్షల ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి, మాటతప్పి జగన్ మడమ తిప్పాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్ సెంటర్ల ద్వారా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలిస్తాం. ఉద్యోగాలు వచ్చేవరకు యువగళం నిధి కింద నెలకు రూ.3వేల చొప్పున భృతి ఇస్తాం’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.
లోకేష్ కుడి చేతికి గాయం
యువ గళం పాదయాత్రలో భాగంగా పరవాడలో నారా లోకేష్ అభివాదం చేసుకుంటూ వస్తున్నారు. ఈ సమయంలో కొంతమంది పార్టీ నేతలు, అభిమానులు కరచాలనo చేసే క్రమంలో నారా లోకేష్ కుడి చేతికి స్వల్ప గాయం అయింది.