Viral Video: సముద్రంలో స్నానాలు చేస్తోంటే సడన్‌గా షాకింగ్ ఘటన.. ఉలిక్కిపడిన జనం.. ఎంజాయ్ చేద్దామని బీచ్‌కు వెళ్తే..!

ABN , First Publish Date - 2023-08-01T18:02:12+05:30 IST

సోషల్ మీడియాలో నిత్యం వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని భయాందోళన కలిగిస్తే.. మరికొన్ని ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వారంతా సరదాగా సముద్రంలో స్నానాలు చేస్తున్నారు. కొందరు....

Viral Video: సముద్రంలో స్నానాలు చేస్తోంటే సడన్‌గా షాకింగ్ ఘటన.. ఉలిక్కిపడిన జనం.. ఎంజాయ్ చేద్దామని బీచ్‌కు వెళ్తే..!

సోషల్ మీడియాలో నిత్యం వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని భయాందోళన కలిగిస్తే.. మరికొన్ని ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వారంతా సరదాగా సముద్రంలో స్నానాలు చేస్తున్నారు. కొందరు బీచ్ అందాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతా ఆనందంగా ఉన్న సమయంలో ఉన్నట్టుండి అనూహ్య ఘటన చోటు చేసుకుంది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

అమెరికాలోని (America) న్యూ హాంప్‌షైర్‌లోని ప్రసిద్ధ హాంప్టన్ బీచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. చాలామంది మహిళలు, పురుషులు.. శనివారం మధ్యాహ్నం ఇక్కడి బీచ్‌లో (beach) సరదా గడుపుతుండగా సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొందరు సముద్రంలో అలల మధ్యలోకి వెళ్లి స్నానం చేస్తుండగా, ఇంకొందరు ఒడ్డున నిలబడి బీచ్ అందాలను తిలకిస్తున్నారు. ఈ సమయంలో ఉన్నట్టుండి ఓ విమానం దూసుకుంటూ వచ్చింది. ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే విమానం వచ్చి నీళ్లలో (plane crashed into the sea) కూలిపోయింది. లైఫ్ గార్డులు వెంటనే అప్రమత్తమై అక్కడికి వెళ్లారు. విమానంలో ఉన్న పైలట్‌ను సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Viral Video: ఇదేం పనయ్యా బాబూ.. ఈ స్కూటీ హారన్ మోగించగానే వస్తున్న శబ్దాలు విని.. పడీపడీ నవ్వుతున్న జనం..!

తర్వాత అంతా కలిసి విమానాన్ని బయటికి లాక్కొచ్చారు. ఇంజిన్ వైఫల్యం కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అధికారులు మాట్లాడుతూ, విమానంలో పైలట్ ఒక్కరే ఉన్నారని, అతడికి ఎలాంటి గాయాలూ కాలేదన్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో (Viral video) ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన తీరు అద్భుతం’’.. అంటూ కొందరు, ‘‘ఈ పైలెట్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 62వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Shocking: వాటర్ బాటిల్‌లో మూత్రాన్ని నింపి.. ఓ విద్యార్థిని స్కూల్‌బ్యాగ్‌లో పెట్టిన కుర్రాళ్లు.. మధ్యాహ్న భోజన సమయంలో..!

Updated Date - 2023-08-01T18:02:12+05:30 IST