Lift: కష్టపడకుండానే కోట్లు సంపాదించాలి.. ఇదీ ఈ దంపతుల ప్లాన్.. నడిరోడ్డుపై భార్యను ఒంటరిగా వదిలేసి భర్త పక్కా స్కెచ్..!
ABN , First Publish Date - 2023-07-25T15:31:18+05:30 IST
కొందరు జల్సాలకు అలవాటు పడి.. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఎంతటి దారుణాలు చేయడానికైనా వెనుకాడడం లేదు. ఇటీవల చాలా మంది మహిళలు కూడా ఇలాంటి నేరాలకు పాల్పడడం చూస్తూనే ఉన్నాం. తాజాగా...
కొందరు జల్సాలకు అలవాటు పడి.. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఎంతటి దారుణాలు చేయడానికైనా వెనుకాడడం లేదు. ఇటీవల చాలా మంది మహిళలు కూడా ఇలాంటి నేరాలకు పాల్పడడం చూస్తూనే ఉన్నాం. తాజాగా, మధ్యప్రదేశ్‌కి చెందిన దంపతుల నిర్వాకానికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సుఖానికి అలవాటు పడ్డ దంపతులు.. కష్టపడకుండానే కోట్లు సంపాదించాలనే ఉద్దేశంతో మాస్టర్ ప్లాన్ వేశారు. నడిరోడ్డుపై భార్యను ఒంటరిగా వదిలేసిన భర్త చివరకు ఎలాంటి స్కెచ్ వేశాడంటే..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) భోపాల్ షాజహన్‌బాద్ ప్రాంత పరిధికి చెందిన దంపతులు (couple) స్థానికంగా ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవారు. వీరి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఎలాగైనా బాగా డబ్బు సంపాదించాలని అనుకునేవారు. అయితే ఎంత కష్టపడ్డా డబ్బులు మాత్రం మిగలకపోవడంతో చివరకు.. కష్టపడకుండానే కోట్లు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ వేశారు. అనుకున్న ప్రకారం రోడ్డుపై నిర్మానుష్య ప్రదేశంలో భార్యను దింపి, వచ్చి పోయే బైకులను లిఫ్ట్ (lift) అడగమని చెప్పాడు. భర్త సూచించన ప్రకారం.. ఏదో ఒక కారణం చెప్పి, బైకులో లిఫ్ట్ అడగడం.. మధ్యలో వారితో సన్నిహితంగా మెలగడం, చివరకు ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లడం చేస్తుండేది.
అలా ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త ఎంటరై.. సదరు వ్యక్తిని బ్లాక్‌మెయిల్ చేసేవాడు. ఎవరికైనా చెబితే.. అత్యాచారం, హత్యాయత్నం కేసులు పెడతామని బెదిరించేవారు. ఇలా వారి బోనులో పడ్డ వారందరి వద్ద నగదు, నగలను (cash and jewellery) దోచుకునేవారు. ఇటీవల ఓ యువకుడిని కూడా ఇలాగే బెదించించారు. చివరకు అతడి బైకును కూడా తీసుకున్నారు. వారి బారి నుంచి బయటపడ్డ యువకుడు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చివరకు దంపతులను అదుపులోకి తీసుకున్నారు. తమ నేరాలన్నీ అంగీకరించడంతో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.