UPI Transactions: పర్సుల్లోంచి డబ్బులు తీయడం లేదా..? షాపుల్లో స్కాన్ చేసే ముందు వీటిని చెక్ చేసుకోకపోతే..!

ABN , First Publish Date - 2023-08-19T17:57:08+05:30 IST

ప్రస్తుతం రూపాయి మొదలుకుని.. వేలు, లక్షల రూపాయల వరకూ ఎక్కువగా ఆన్‌లైన్ ట్రాన్సక్షన్స్ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. మరోవైపు ఉదయం టీ తాగడానికి మొదలు, కూరగాయలు తదితర నిత్యవసరాలకు సైతం ఫోన్ పే, గూగుల్ పే, పేటీమ్ ద్వారా నగదు చెల్లించడం సర్వసాధారణమైపోయింది. డిజిటల్ పేమెంట్స్‌తో..

UPI Transactions: పర్సుల్లోంచి డబ్బులు తీయడం లేదా..? షాపుల్లో స్కాన్ చేసే ముందు వీటిని చెక్ చేసుకోకపోతే..!

ప్రస్తుతం రూపాయి మొదలుకుని.. వేలు, లక్షల రూపాయల వరకూ ఎక్కువగా ఆన్‌లైన్ ట్రాన్సక్షన్స్ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. మరోవైపు ఉదయం టీ తాగడానికి మొదలు, కూరగాయలు తదితర నిత్యవసరాలకు సైతం ఫోన్ పే, గూగుల్ పే, పేటీమ్ ద్వారా నగదు చెల్లించడం సర్వసాధారణమైపోయింది. డిజిటల్ పేమెంట్స్‌తో పలు రకాల లాభాలు ఉన్నా.. దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన లేకుంటే మాత్రం అంతే స్థాయిలో నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. షాపుల్లో స్కాన్ చేసే ముందు ఈ విషయాలు విధిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ జాగ్రత్తలేంటో ఓ లుక్కేద్దాం..

ప్రస్తుతం పల్లెలు మొదలుకుని పట్టణాలు, నగరాల వరకూ యూపీఐ టాన్సక్షన్సే (UPI Transactions) ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో సైబర్ నేరగాళ్ల దృష్టి ప్రస్తుతం దీనిపై పడింది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. బ్యాంకు ఖాతాను ఖాళీ చేసేస్తున్నారు. దీంతో UPI చెల్లింపుల్లో జరిగే మోసాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై NPCI (National Payments Corporation of India) పలు సూచనలు చేసింది. UPI చెల్లింపులను సురక్షింతంగా చేసేందుకు NPCI కొన్ని చిట్కాలను సూచించింది. UPI వినియోగదారులు డబ్బును బదిలీ చేయడానికి తరచూ పిన్‌ని నమోదు చేస్తుంటారు. అయితే ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి ముందు నగదు స్వీకరించే వ్యక్తికి సంబంధించిన UPI IDని క్రాస్ చెక్ చేసుకోవాలి.

Rich Families of India: అంబానీ నుంచి టాటా వరకు.. భారత్‌లో ఈ 6 కుటుంబాలే అత్యంత సంపన్నులు..!

UPI-Transactions.jpg

ధ్రువీకరణ చేసుకోకుండా ఎవరికీ నగదు చెల్లింపులు చేయొద్దు. మీ యాప్ పిన్ పేజీలో మాత్రమే UPI పిన్‌ని నమోదు చేయాలి. అలాగే ఈ UPI పిన్‌ను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. ఇకపోతే డబ్బు బదిలీ చేయడానికి మాత్రమే క్యూఆర్ కోడ్‌ను (QR code) స్కాన్ చేయాలి. డబ్బును స్వీకరించడానికి అయితే క్యూఆర్ కోడ్ అవసరం లేదు. ఇక మరీ ముఖ్యంగామీ ఫోన్‌లో ఎలాంటి స్క్రీన్ షేరింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోకండి. ఇలా చేయడం వల్ల UPI ID, PIN మొదలైన మీ వ్యక్తిగత సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్లకు చేరే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా UPI యాప్ లాక్, ఫింగర్‌ప్రింట్‌, ఫేస్‌ అథెంటికేషన్‌ తదితర సెక్యూరిటీ ఫీచర్లను ఎనేబుల్‌ చేసుకోవాలి. ఈ ఫీచర్లు అనాథరైజ్డ్‌ యాక్సెస్‌లను నిరోధించడానికి సాయపడతాయి.

Shocking: మీ అమ్మాయిని పూడ్చి పెట్టిన చోట ఏవో వింత శబ్దాలు వస్తున్నాయని చెప్పిన కాటికాపరి.. అనుమానంతో తవ్వి చూస్తే..!

Updated Date - 2023-08-19T17:57:08+05:30 IST