Viral Video: 9 అడుగుల వెడల్పులో ఇంత పెద్ద హోటల్ ఎలా కట్టారబ్బా..? ప్రపంచంలోనే ఇదో వింత..!
ABN , First Publish Date - 2023-11-24T17:14:54+05:30 IST
రోజురోజుకూ జనాభా పెరుగుతుండడంతో స్థలాభావ సమస్య తలెత్తుతోంది. ఇక పట్టణాలు, నగరాల్లో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో చాలా మంది తక్కువ స్థలంలోనే ఎక్కువ అంతస్తులు వచ్చేలా ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం చూస్తూనే ఉన్నాం. అయితే...
రోజురోజుకూ జనాభా పెరుగుతుండడంతో స్థలాభావ సమస్య తలెత్తుతోంది. ఇక పట్టణాలు, నగరాల్లో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో చాలా మంది తక్కువ స్థలంలోనే ఎక్కువ అంతస్తులు వచ్చేలా ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం చూస్తూనే ఉన్నాం. అయితే కొందరు మరింత తెలివిగా ఆలోచించి.. అత్యంత తక్కువ విస్తీర్ణంలో అతి పెద్ద భవనాలు నిర్మించడం కూడా చూస్తున్నాం. ఇలాంటి భవంతులను చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి ఇళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవువుతుంటాయి. తాజాగా, ఈ తరహా బిల్డింగ్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. 9అడుగుల వెడల్పలో అత్యంత ఎత్తైన హోటల్‌ను నిర్మించడం చూసి అంతా అవాక్కవుతున్నారు.
ఇండోనేషియాలోని (Indonesia) ఓ హోటల్ భవనానికి సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సెంట్రల్ జావాలోని సలాటిగా టౌన్‌లో ఉన్న ‘‘పిటురూమ్స్’’ హోటల్ ప్రపంచంలోనే అత్యంత తక్కువ స్థలంలో నిర్మించిన అతి పెద్ద భవంతిగా రికార్డుల్లోకి ఎక్కింది. కేవలం 9అడుగుల విస్తీర్ణంలో ఈ హోటల్‌ని (Construction of tall building on nine feet site) నిర్మించారు. ఐదంస్థుల ఈ హోటల్లో సౌకర్యాలు కూడా అంతే ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి. ఈ హోటల్‌కి (innovative hotel) వచ్చిన వారంతా వింత అనుభూతికి లోనవుతున్నారు. చాలా మంది కేవలం ఈ భవంతిని చూడటానికే తండోపతండాలుగా వస్తుంటారు.
ఈ హోటల్ నిర్మించిన ప్రదేశం ఒకప్పుడు.. డంపిండ్ యార్డుగా ఉండేది. సింగపూర్, జకార్తాలో ఆర్కిటెక్ట్‌గా శిక్షణ పొందిన ఓ వ్యక్తి పిటూరూమ్స్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ భవనాన్ని నిర్మించాడు. 2022 డిసెంబర్‌లో ఈ హోటల్‌ను ప్రారంభించారు. జపనీస్ భాషలో పిటూ అంటే ఏడు అని అర్థం. ఈ హోటల్‌లో ఏడు గదులు ఉండడంతో పిటూరూమ్స్ అని పేరు పెట్టారు. ఒక్కో అంతస్తులోని ప్రతి గదినీ ఆకట్టుకునేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మరీ నిర్మించారు. మరోవైపు ఈ భవంతి పై అంతస్తులో బార్ అండ్ రెస్టారెంట్ ఉండడంతో వచ్చిన అతిథులంతా ప్రత్యేక అనుభూతికి లోనవుతున్నారు. కాగా, ఈ భవంతి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.