Viral Video: దూల తీరిపోవడం అంటే ఇదే.. బైక్‌ టైర్లతో మంటను తెప్పించాలనుకున్నారు.. చివరకు జరిగింది ఇదీ..!

ABN , First Publish Date - 2023-04-26T16:08:50+05:30 IST

లైకులు, వ్యూస్ కోసం చాలా మంది యువతీయువకులు చేసే పనులు.. కోతి చేష్టలను తలపిస్తుంటాయి. రీల్స్‌ ద్వారా ఫేమస్ అయ్యేందుకు ఏదోటి వెరైటీగా చేయాలని పోయి.. కొన్నిసార్లు చివరకు ఊహించని ప్రమాదాల బారిన పడుతుంటారు. ఇందుకు నిదర్శనంగా..

Viral Video: దూల తీరిపోవడం అంటే ఇదే.. బైక్‌ టైర్లతో మంటను తెప్పించాలనుకున్నారు.. చివరకు జరిగింది ఇదీ..!

లైకులు, వ్యూస్ కోసం చాలా మంది యువతీయువకులు చేసే పనులు.. కోతి చేష్టలను తలపిస్తుంటాయి. రీల్స్‌ ద్వారా ఫేమస్ అయ్యేందుకు ఏదోటి వెరైటీగా చేయాలని పోయి.. కొన్నిసార్లు చివరకు ఊహించని ప్రమాదాల బారిన పడుతుంటారు. ఇందుకు నిదర్శనంగా సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బైక్ టైర్లతో మంటలు తెప్పించాలని చూసిన యువకుల ప్రయత్నం చివరకు అనుకున్నదొకటి.. అయినదొకటి.. అన్నట్లుగా మారింది.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. కొందరు యువకులు బైకుతో వినూత్న స్టంట్ (Innovative bike stunt) చేయాలని చూస్తారు. ఇందుకోసం బైకును స్టాండ్ వేసి, వెనుక టైరును రన్నింగ్‌లో పెడతారు. అత్యంత వేగంగా తిరుగుతున్న టైరు.. నేలను తాకుతుండడం వల్ల మంటలు (fires) చెలరేగుతూ ఉంటాయి. అయితే అంతటితో ఆగని యువకులు.. టైరుపై పెట్రోల్ (Petrol) పోస్తే మరింత పెద్ద మంట వస్తుందని అనుకుంటారు. ఈ క్రమంలో ముందు కొంచెం పెట్రోల్‌ను బైకు ట్యాంక్‌లో పోస్తారు. తర్వాత వేగంగా తిరుగుతున్న వెనుక టైరుపై పెట్రోల్ పోస్తాడు.

Viral Video: తప్పు చేయాలన్న ఆలోచన వచ్చిన మరుక్షణమే శిక్ష పడితే.. ఇదిగో ఈ కుర్రాడికి అదే జరిగింది..!

పెట్రోల్ పోసిన వెంటనే ఒక్కసారగా పెద్ద మంట (fire accident) వస్తుంది. దీంతో అక్కడున్న వారంతా కేకలు పెడుతూ పరుగులు పెడతారు. ఈ ప్రమాదంలో యువకులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేయడం చాలా ప్రమాదం అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి పిచ్చి పనులు చేస్తే.. ఇలాగే జరుగుతుంది మరి’’.. అని కొందరు, ‘‘ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకూడదు’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వాషింగ్ మెషిన్‌లో ఇరుక్కున్న మహిళను.. చిన్న టెక్నిక్‌తో ఈ పోలీసు ఎలా కాపాడాడో చూడండి..

Updated Date - 2023-04-26T16:08:50+05:30 IST