Viral Video: తప్పు చేయాలన్న ఆలోచన వచ్చిన మరుక్షణమే శిక్ష పడితే.. ఇదిగో ఈ కుర్రాడికి అదే జరిగింది..!

ABN , First Publish Date - 2023-04-26T15:21:50+05:30 IST

తప్పు చేయాలన్న ఆలోచన వచ్చిన మరుక్షణమే శిక్ష పడితే.. నేరాలు చేసేందుకు ఎవరూ సాహసించరు. అయితే చాలా మంది తప్పు చేసినా తప్పించుకుని తిరుగుతుంటారు. అయితే అప్పుడప్పుడు మాత్రం తప్పు చేసిన వెంటనే శిక్ష అనుభవించడం కూడా చూస్తుంటాం. మహిళలపై..

Viral Video: తప్పు చేయాలన్న ఆలోచన వచ్చిన మరుక్షణమే శిక్ష పడితే.. ఇదిగో ఈ కుర్రాడికి అదే జరిగింది..!

తప్పు చేయాలన్న ఆలోచన వచ్చిన మరుక్షణమే శిక్ష పడితే.. నేరాలు చేసేందుకు ఎవరూ సాహసించరు. అయితే చాలా మంది తప్పు చేసినా తప్పించుకుని తిరుగుతుంటారు. అయితే అప్పుడప్పుడు మాత్రం తప్పు చేసిన వెంటనే శిక్ష అనుభవించడం కూడా చూస్తుంటాం. మహిళలపై దాడులు, చోరీ కేసుల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. నడి రోడ్డుపై ఓ కుర్రాడు చోరీ చేయాలని చూస్తాడు. అయితే ఆ మరుక్షణమనే చోటు చేసుకున్న ఘటనతో.. సదరు వ్యక్తి కుయ్యో, ముర్రో అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు (Viral videos) కొడుతోంది. ఓ వ్యక్తి నడి రోడ్డుపై ఉన్న మ్యాన్‌హోల్ మూతను (Manhole cover theft) చోరీ చేసేందుకు ప్రయత్నిస్తాడు. అప్పటికే ఫుల్‌గా మందు కొట్టి ఉన్న అతను.. మ్యాన్‌హోల్ లోకి దిగి బరువుగా ఉన్న మూతను భుజం పైకి ఎత్తుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. మూత చాలా బరువు ఉండడంతో అది సాధ్యం కాదు. అయినా ఎలాగైనా దాన్ని ఎత్తుకెళ్లాలని చూస్తుంటాడు. అదే సమయంలో అక్కడికి ఓ వ్యక్తి బైకులో వస్తాడు. అతడి పక్కనే బైకును ఆపి గమనిస్తుంటాడు. సదరు యువకుడు (young man) ఇనుప మూతను ఎలాగోలా పైకి ఎత్తుకుని అక్కడి నుంచి వెళ్లాలని చూస్తుంటాడు.

Viral Video: బైకు ఎక్కే స్టయిల్ బాగుంది.. కానీ చివర్లో ఇలా చేశావేంటీ..! యువతి విన్యాసంపై నెటిజన్ల సెటైర్లు..

ఈ క్రమంలో బైకుపై పడబోతుంటాడు. దీంతో బైకర్ (Biker) తన వాహనాన్ని కాస్త ముందుకు వెళ్లి ఆపుతాడు. మూతను ఎత్తుకెళ్లే క్రమంలో అదుపు తప్పి ధమేల్‌మని మ్యాన్‌హోల్‌లో పడతాడు. మూత ఎగిరి పక్కన పడుతుంది. అదృష్టవశాత్తు మీద పడకపోవడంతో ప్రమాదం తప్పిపోయింది. కింద పడ్డ అతను.. ‘‘కుయ్యో.. ముర్రో.. చచ్చాన్రో దేవుడో’’.. అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘‘కర్మ సిద్ధాంతం అంటే ఇదేనేమో’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారికి ఇలాగే జరగాలి’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వాషింగ్ మెషిన్‌లో ఇరుక్కున్న మహిళను.. చిన్న టెక్నిక్‌తో ఈ పోలీసు ఎలా కాపాడాడో చూడండి..

Updated Date - 2023-04-26T15:21:50+05:30 IST