Viral Video: ఏనుగులతో ఇలా అడుక్కోవడం ఎక్కడైనా చూశారా.. పట్ట పగలు నాలుగు రోడ్ల కూడళ్లలో వీరు చేస్తున్న పని చూడండి..

ABN , First Publish Date - 2023-10-12T21:54:11+05:30 IST

నాలుగు రోడ్ల కూడళ్లలో వాహనాలు ఇలా ఆగగానే.. అలా భిక్షగాళ్లు వచ్చేస్తుంటారు. అయితే వారిలో కొందరిని చూస్తే జాలి కలిగి వెంటనే డబ్బులు ఇస్తూ ఉంటాం. మరికొందరిని చూస్తే.. ‘‘కాళ్లూ, చేతులూ బాగానే ఉన్నాయిగా.. ఏదైనా పని చేసుకోవచ్చుగా’’.. అని అంటూ ఉంటాం. ఏది ఏమైనా...

Viral Video: ఏనుగులతో ఇలా అడుక్కోవడం ఎక్కడైనా చూశారా.. పట్ట పగలు నాలుగు రోడ్ల కూడళ్లలో వీరు చేస్తున్న పని చూడండి..

నాలుగు రోడ్ల కూడళ్లలో వాహనాలు ఇలా ఆగగానే.. అలా భిక్షగాళ్లు వచ్చేస్తుంటారు. అయితే వారిలో కొందరిని చూస్తే జాలి కలిగి వెంటనే డబ్బులు ఇస్తూ ఉంటాం. మరికొందరిని చూస్తే.. ‘‘కాళ్లూ, చేతులూ బాగానే ఉన్నాయిగా.. ఏదైనా పని చేసుకోవచ్చుగా’’.. అని అంటూ ఉంటాం. ఏది ఏమైనా డబ్బులు ఇవ్వడం అనేది మన నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. అయితే అలా కాకుండా బలవంతంగా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది.

పశ్చిమబెంగాల్ లేదా బంగ్లాదేశ్‌లో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. రద్దీగా ఉన్న నాలుగు రోడ్ల కూడలి వద్ద రెడ్ లైట్ పడగానే వాహనాలన్నీ నిలిచిపోతాయి. ఇంతలో అక్కడికి కొందరు ఏనుగుల మీద కూర్చుని అక్కడికి వస్తారు. వాహనాల దగ్గరికి వస్తున్న వాటిని చూసిన వారంతా.. ఏనుగులతో (elephants) ఆశీర్వదించయి, డబ్బులు అడుక్కుంటారేమో (Begging) .. అని అనుకున్నారు. కానీ దగ్గరికి రాగానే ఏనుగుల పైన ఉన్న వారు తాము అడిగినంత డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ ఆర్డర్ వేయడంతో పాటూ తొక్కిస్తామంటూ.. ఏనుగు ముందు కాళ్లను ఒక్కసారిగా గాల్లోకి లేపారు. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోయి వారు అడిగినంతం మొత్తం ఇచ్చేశారు.

Viral news: సిగరెట్ తాగుతున్న అమ్మాయిలను రోజూ చాటుగా గమనిస్తూ వచ్చిన వృద్ధుడు.. ఓ రోజు రాత్రి ఉన్నట్టుండి అతడు చేసిన పనితో..

ఇలా వారు ద్విచక్రవాహనదారులను భయపెట్టి మరీ డబ్బులు వసూలు చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తికి కోపం వచ్చి బైకు దిగి రాయి తీసుకుని వారిని వెంబడించబోయాడు. అయినా వారు మాత్రం ఏమాత్రం భయం లేకుండా కాస్త దూరం వెళ్లి ఇదే విధంగా అడుక్కోవడం మొదలెట్టారు. అన్యమతాలకు చెందిన వారు ఏనుగులను ఇలా వాడుకుని, వాటిని వేధించడంతో పాటూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఇదేం అడుక్కోవడం రా నాయనా’’.. అని కొందరు, ‘‘జంతువులను హింసించడం నేరం’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: టికెట్ లేకుండా వందే భారత్ రైలు ఎక్కిన కానిస్టేబుల్.. టీసీ రావడంతో చివరకు ఏం జరిగిందంటే..

Updated Date - 2023-10-12T21:54:11+05:30 IST