Crime News: ఉన్నట్టుండి బావను దూరం పెట్టిన మరదలు.. ఎవరూ లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లగా..
ABN , First Publish Date - 2023-08-20T18:53:10+05:30 IST
సంతోషంగా సాగుతున్న జీవితాన్ని కొందరు చేజేతులా సర్వ నాశనం చేసుకుంటుంటారు. తెలిసి తెలిసి తప్పులు చేయడం.. చివరకు, అలా చేయకుండా ఉండుంటే బాగుండు.. అని తెగ బాధపడిపోతుంటారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం కాస్తా జరిగిపోయి ఉంటుంది. వివాహేతర సంబంధాల విషయంలో ఇలాంటి ...
సంతోషంగా సాగుతున్న జీవితాన్ని కొందరు చేజేతులా సర్వ నాశనం చేసుకుంటుంటారు. తెలిసి తెలిసి తప్పులు చేయడం.. చివరకు, అలా చేయకుండా ఉండుంటే బాగుండు.. అని తెగ బాధపడిపోతుంటారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం కాస్తా జరిగిపోయి ఉంటుంది. వివాహేతర సంబంధాల విషయంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, హర్యానాలో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. ఓ మహిళ తన భర్తకు తెలీకుండా బావతో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఇటీవల ఉన్నట్టుండి అతన్ని దూరం పెట్టింది. ఇటీవల ఓ రోజు ఎవరూ లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లిన బావ.. చివరకు ఏం చేశాడంటే..
హర్యానా (Haryana) భివానీలోని తిగ్దానా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ దంపతుల మధ్య ఎలాంటి సమస్యలు లేకున్నా.. భార్య తెలిసి తెలిసి సమస్యలు కొని తెచ్చుకుంది. ఈమె భర్త సోదరుడైన దీపక్ అలియాస్ ఛోటూ తరచూ వీరి ఇంటికి వస్తూ ఉండేవాడు. బావే కావడంతో ఆమె కూడా అతడితో చనువుగా ఉండేది. ఇలా వీరి మధ్య కొన్నాళ్లకు వివాహేతర సంబంధం (extramarital affair) ఏర్పడింది. సదరు మహిళ తన భర్తకు తెలీకుండా బావను కలుస్తూ ఉండేది. ఇదిలావుండగా, భర్తకు తెలుస్తుందనే ఉద్దేశంతో ఇటీవల ఆమె తన బావను దూరం పెట్టింది.
ఎంత ప్రయత్నించినా అతడికి దూరంగా ఉంటూ వచ్చింది. దీంతో ఆమెపై బావ కోపం పెంచుకున్నాడు. ఇటీవల ఆమె మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని అతడికి తెలిసింది. దీంతో ఆమెపై మరింత పగ పెంచుకున్నాడు. ఆగస్టు 17న ఎవరూ లేని సమయం చూసి ఆమె ఇంటికి వెళ్లాడు. వెళ్లీ వెళ్లగానే ఆమెతో గొడవపెట్టుకుని, పట్టరాని కోపంతో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. చివరకు ఆమెను గొంతు నులిమి హత్య చేసి పరారరయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.