NRI Doctor: క్రైమ్ థ్రిల్లర్‌ను మించిన ట్విస్టులు.. ఆ ఆస్పత్రిలో వరుసగా ఏడుగురు పిల్లల మృతి.. ఈ డాక్టర్‌కు వచ్చిన డౌట్‌తో..!
ABN , First Publish Date - 2023-08-19T20:53:37+05:30 IST
తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మ ఇస్తారు. అందుకే వైద్యో నారాయణో హరి.. అని అంటూ ఉంటాం. ప్రాణాల మీద ఆశలు వదులుకున్న స్థితిలో ఎంతో మంది వైద్యులు.. వారికి తిరిగి ప్రాణం పోసిన సందర్భాలను చాలా చూశాం. అయితే నేటి సమాజంలో కొందరు...
తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మ ఇస్తారు. అందుకే వైద్యో నారాయణో హరి.. అని అంటూ ఉంటాం. ప్రాణాల మీద ఆశలు వదులుకున్న స్థితిలో ఎంతో మంది వైద్యులు.. వారికి తిరిగి ప్రాణం పోసిన సందర్భాలను చాలా చూశాం. అయితే నేటి సమాజంలో కొందరు వైద్యులు, సిబ్బంది.. వైద్య వృత్తికే మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, యూకేలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ ఆస్పత్రిలో పుట్టిన బిడ్డ పుట్టినట్టే చనిపోతోంది. ఇలా వరుసగా ఏడుగురు పిల్లలు మృతి చెందారు. చివరకు ఓ డాక్డర్‌కు వచ్చిన సందేహంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
యూకే (UK) మాంచెస్టర్‌లోని ఓ ఆస్పత్రిలో లూసీ లెట్బీ అనే 33 ఏళ్ల నర్సు (nurse) పని చేస్తోంది. ఈమెకు వయసు పెరిగిపోతున్నా ఇంతవరకూ వివాహం కాలేదు. పెళ్లి చేసుకుని పిల్లలు కని, ఫ్యామిలీతో సంతోషంగా గడపాలనేది ఈమె కోరిక. అయితే ఏళ్లు గడుస్తున్నా ఆ కోరిక మాత్రం తీరడం లేదు. దీంతో మానసికంగా (mental stress) తీవ్రంగా కుంగిపోయింది. దీన్నుంచి బయటపడి.. నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవాల్సిన ఆమె.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. రోజురోజుకూ తీవ్ర డిప్రెషన్‌కు గురవుతూ చివరకు సైకోలా మారిపోయింది. డెలివరీ వార్డులో పని చేస్తున్న ఈమె.. 2015-2016 మధ్య కాలంలో అత్యంత దారుణంగా ప్రవర్తించింది. అప్పుడే పుట్టిన పసి పిల్లల శరీరంలోకి గాలి, ఇన్సులిన్‌ను చొప్పించడం, పాలు తదితర ద్రవ పదార్థాలను బలవంతంగా తినిపించడం ద్వారా (nurse killed the babies) శిశువులను హత్య చేసింది.
ఇలా వరుసగా పిల్లలు చనిపోతుండడంతో వైద్యులకు మొదట ఏమీ అర్థం కాలేదు. నిందితురాలు తెలివిగా పసి కందులు అస్వస్థతకు గురైన వెంటనే కంగారుగా వెళ్లి వైద్యులను అలెర్ట్ చేస్తూ ఉండేది. చిన్నారులను బతికించేందుకు ఓ వైద్యులు కంగారుపడుతూ ఉండడం, మరోవైపు తమ పిల్లల పరిస్థితి చూసి తల్లిదండ్రులు విలపించడాన్ని చూసి.. నర్సు ఎంజాయ్ చేస్తూ ఉండేదట. ఈ క్రమంలో చిన్నారికి చికిత్స చేస్తున్న ఓ వైద్యుడితో.. ‘‘ఈ చిన్నారి బతుతుకుందని మీరు అనుకుంటున్నా’’.. అని నర్సు అన్న కొన్ని నిముషాల్లోనే చిన్నారి చనిపోయింది. దీంతో వైద్యులకు అనుమానం మొదలైంది. సుమారు 10 నెలల విచారణ అనంతరం పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు ఇదే ఆస్పత్రిలో పని చేస్తున్న చిన్న పిల్లల వైద్యుడితో లూసీకి వివాహేతర సంబంధం ఉన్నట్లు కూడా బయటపడింది. ఆ డాక్టర్ దృష్టిలో పడేందుకూ పిల్లలను హాని చేసేదని తెలిసింది. ఆమె గదిలో పోలీసులు తనిఖీ చేయగా.. ‘‘నేను చెడ్డదాన్ని, వారిని ఉద్దేశపూర్వకంగానే చంపాను’’, ‘‘నాకు ఎప్పటికీ పెళ్లికాదు, పిల్లలు పుట్టరు. కుటుంబంతో కలిసి ఉండే యోగ్యత నాకు లేద’’.. ఇలా రాసి ఉన్న పేపర్లు బయటపడ్డాయి. ఈ కేసుపై పూర్తి విచారణ చేపట్టిన న్యాయస్థానం.. చివరకు లూసీని దోషిగా నిర్ధారించింది. సోమవారం ఆమెకు శిక్షను ఖరారు చేయనున్నారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘‘ఇలాంటి నర్సులపై.. కఠిన చర్యలు తీసుకోవాలి’’.. అంటూ నెటిజన్లు డిమాండ్లు చేస్తున్నారు.
Rich Families of India: అంబానీ నుంచి టాటా వరకు.. భారత్‌లో ఈ 6 కుటుంబాలే అత్యంత సంపన్నులు..!