Viral Video: రాళ్ల గుట్టపైకి ఎక్కేసిన ఒంటె.. కిందకు దిగలేక తంటాలు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!
ABN , First Publish Date - 2023-08-08T21:57:27+05:30 IST
ఎడారి ఓడలుగా పేరుగాంచిన ఒంటెలు.. ఇసుకలో నీరు లేకుండా రోజుల తరబడి ప్రయాణించగలవు. ఈ విషయం అందరికీ తెలిసిందే.. కానీ ఇదే ఒంటె కొండలు ఎక్కగలవా అంటే చాలా మందికి సందేహం కలుగుతుంది. అదెలా సాధ్యం.. అంద పెద్ద ఒంటె కొండను ఎలా ఎక్కుతుంది. ఒక వేళ ఎక్కినా..
ఎడారి ఓడలుగా పేరుగాంచిన ఒంటెలు.. ఇసుకలో నీరు లేకుండా రోజుల తరబడి ప్రయాణించగలవు. ఈ విషయం అందరికీ తెలిసిందే.. కానీ ఇదే ఒంటెలు కొండలు ఎక్కగలవా.. అంటే చాలా మందికి సందేహం కలుగుతుంది. అదెలా సాధ్యం.. అంద పెద్ద ఒంటె కొండను ఎలా ఎక్కుతుంది. ఒక వేళ ఎక్కినా దిగడం సాధ్యమా.. అని ఎవరికైనా డౌట్ వస్తుంది. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కొండెక్కిన ఒంటెను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అయితే పాపం కొండ పైనుంచి కిందకు దిగలేక నానా తంటాలు పడిది. చివరకు ఏం జరిగిందంటే..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఎలా ఎక్కిందో ఏమో తెలీదు గానీ.. ఓ ఒంటె నిటారుగా (camel climbed the hill) ఉన్న ఓ పెద్ద కొండను ఎక్కేసింది. అయితే తర్వాత దాని నుంచి ఎలా దిగాలో దానికి అర్థం కాలేదు. అయితే ఎలాగైనా దిగి తీరాల్సిందే అనుకుందో ఏమో గానీ.. ధైర్యం చేసి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ దిగింది. సగానికి దిగాద దానికి కింద రోడ్డు కనిపించింది. అయితే తర్వాత కిందకు దిగడం సాధ్యం కాలేదు. దీంతో మధ్యలో నిలబడి చాలా సేపు వేచి చూసింది. అయితే అక్కడి నుంచి ఇక వెళ్లడం అసాధ్యం. ఎలాగైనా దిగాల్సిందే తప్ప వేరే మార్గం లేదు.
చివరకు ఒంటె కిందకు దిగేందుకే మొగ్గు చూపింది. అయితే ఈ క్రమంలో అదుపు తప్పి పైనుంచి ధమేల్‌మని కింద పడిపోయింది. తక్కువ ఎత్తు నుంచి పడిపోవడంతో ఒంటెకు ఏమీ కాలేదు. కిందపడ్డ వెంటనే మళ్లీ పైకి లేచి.. ‘‘చచ్చాన్రో దేవుడో.. ఇక బుద్ధి ఉంటే కొండలు ఎక్కకూడదు’’.. అనుకుంటూ అక్కడ నుంచి మెల్లగా నడుచుకుంటూ వెళ్లిపోతుంది. ఈ ఘటనను మొత్తం రోడ్డుపై ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అక్కడున్న వారు వీడియో తీయకపోతే.. వెళ్లి సాయం చేయొచ్చుగా’’.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.