Bride: కారు తీసుకొస్తా.. గదిలోనే ఉండంటూ హోటల్ నుంచి బయటకు వెళ్లిన భర్త.. తిరిగొచ్చే సరికి ఊహించని ట్విస్ట్..!
ABN , First Publish Date - 2023-08-08T18:27:53+05:30 IST
అతిథులందరి సమక్షంలో అంగరంగవైభవంగా వివాహం చేసుకున్నారు. అనంతరం అందరిలాగానే హనీమూన్‌ను కూడా ఎంతో గ్రాండ్‌గా ప్లాన్ చేసుకున్నారు. భార్యను తీసుకుని ఎంతో సంతోషంగా బయలుదేరాడు. హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నారు. ‘‘గదిలోనే ఉండు.. వెళ్లి కారు తీసుకొస్తా’’.. అంటూ..
అతిథులందరి సమక్షంలో అంగరంగవైభవంగా వివాహం చేసుకున్నారు. అనంతరం అందరిలాగానే హనీమూన్‌ను కూడా ఎంతో గ్రాండ్‌గా ప్లాన్ చేసుకున్నారు. భార్యను తీసుకుని ఎంతో సంతోషంగా బయలుదేరాడు. హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నారు. ‘‘గదిలోనే ఉండు.. వెళ్లి కారు తీసుకొస్తా’’.. అంటూ బయటకు వెళ్లాడు. అయితే తిరిగి వచ్చి చూసేసరికి భార్య కనిపించలేదు. చివరకు హోటల్ యాజమాన్యం సీసీ కెమెరాలు పరిశీలించగా.. షాకింగ్ దృశ్యం కనిపించింది. పెళ్లయిన ఏడవ రోజూ ఇలా జరగడంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) భోపాల్‌కు చెందిన 24ఏళ్ల యువకుడికి ఇదే ప్రాంతానికి చెందిన 22ఏళ్ల యువతితో జూలై 29న వివాహమైంది. భార్యను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న భర్త.. ఆమెకు మరింత ఆనందం పంచేందుకు హనీమూన్ (Honeymoon) ప్లాన్ చేశాడు. అనంతరం రాజస్థాన్‌లోని జైపూర్ (Rajasthan Jaipur) ప్రాంతానికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. చివరకు ఇద్దరూ కలిసి సంతోషంగా ఆగస్టు 5న జైపూర్‌కు బయలుదేరారు. జైపూర్‌లోని చౌము పులియా సమీపంలోని ఓ హోటల్లో గది అద్దెకు తీసుకున్నారు. ఈ ప్రాంతంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలని అనుకున్నారు. ఇందుకోసం ట్యాక్సీ బుక్ చేసేందుకు భర్త బయటికి వెళ్లాడు.
కొద్ది సేపటికి తిరిగి గదికి రాగా.. లోపల భార్య కనిపించలేదు. గది మొత్తం వెతికినా ఆమె ఎక్కడా లేకపోవడంతో కంగారుపడ్డాడు. హోటల్ బయటికి వెళ్లి చూశాడు. అయినా ఆమె ఎక్కడా కనిపించలేదు. చివరకు హోటల్ యాజమన్యానికి తెలియజేయడంతో హోటల్లోని సీసీ కెమెరాలను (CC cameras) పరిశీలించారు. వధువు (bride) గది బయటికి వచ్చి ఎవరితోనే ఫోన్లో మాట్లాడుతూ వెళ్లిపోయినట్లు కనిపించింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలువురిని విచారించారు. వధువు చెప్పాపెట్టకుండా అదృశ్యమవడం వెనుక.. ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.