Divorce: పెళ్లయిన 4 ఏళ్లకే విడాకులకు దరఖాస్తు.. 38 ఏళ్ల తర్వాత.. పిల్లల పెళ్లిళ్లు కూడా అయ్యాక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన కోర్టు..!

ABN , First Publish Date - 2023-08-08T21:23:43+05:30 IST

ఒక్కసారి కోర్టుకు వెళ్లిన కేసు.. పరిష్కారం కావాలంటే కొన్ని సార్లు నెలలు, మరికొన్ని సార్లు సంవత్సరాలు పడుతుంది. ఇంకొన్ని కేసులైతే ఏళ్లకు ఏళ్లు పెండింగ్‌లో ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కేసు మాత్రం చాలా విచిత్రమైంది. ఆ దంపతులు పెళ్లయిన నాలుగేళ్లకే...

Divorce: పెళ్లయిన 4 ఏళ్లకే విడాకులకు దరఖాస్తు.. 38 ఏళ్ల తర్వాత.. పిల్లల పెళ్లిళ్లు కూడా అయ్యాక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన కోర్టు..!
ప్రతీకాత్మక చిత్రం

ఒక్కసారి కోర్టుకు వెళ్లిన కేసు.. పరిష్కారం కావాలంటే కొన్ని సార్లు నెలలు, మరికొన్ని సార్లు సంవత్సరాలు పడుతుంది. ఇంకొన్ని కేసులైతే ఏళ్లకు ఏళ్లు పెండింగ్‌లో ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కేసు మాత్రం చాలా విచిత్రమైంది. ఆ దంపతులు పెళ్లయిన నాలుగేళ్లకే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే దీనిపై 38 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఇచ్చింది. పిల్లల పెళ్లిళ్లు కూడా అయ్యాక చివరకు కోర్టు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) గ్వాలియర్‌లో వింత కేసు వెలుగులోకి వచ్చింది. భోనాల్‌కు చెందిన ఓ రిటైర్డ్ ఇంజనీర్‌కు.. గ్వాలియర్‌కు (Gwalior) చెందిన మహిళతో 1981లో వివాహమైంది. అయితే వివాహమైన నాలుగేళ్ల వరకూ వీరికి సంతానం కలగలేదు. ఇక పిల్లలు పుట్టరని భావించిన భర్త.. ఎలాగైనా భార్యతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే భార్యకు మాత్రం విడాకులు (Divorce) తీసుకోవడం ఇష్టం లేదు. అయితే భర్త మాత్రం విడాకులు కావాలంటూ 1985 జూలైలో స్థానిక కోర్టును ఆశ్రయించాడు. అయితే ఇతడి దావాను కోర్టు తిరస్కరించబడింది. మరోవైపు పోలీసు అధారి అయిన సదరు మహిళ తండ్రికి కూడా తన కూతురికి విడాకులు రావడం ఇష్టం లేదు.

Viral Video: కోతితో స్నేహం చేసిన కప్ప.. మరో కోతి దగ్గరికి రాగానే ఎలా రియాక్షన్ ఇచ్చిందో చూడండి..

చివరకు ఆమె కూడా కోర్టును ఆశ్రయించింది. ఇలా భార్యాభర్తలు పరస్పరం వివిధ కోర్టుల్లో అప్పీలు చేసుకోవడంతో ఈ వ్యవహారం చాలా కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. దీంతో చివరకు భర్త 2008లో సుప్రీం కోర్టును (Supreme Court) కూడా ఆశ్రయించాడు. అక్కడ కూడా ఇతడికి నిరాశే ఎదురైంది. ఎట్టకేలకు 38 తర్వాత హైకోర్టులోని గ్వాలియర్ బెంచ్ వీరికి విడాకులు మంజూరు చేసింది. భార్యకు సుమారు రూ.12లక్షలు చెల్లించాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇదిలావుండగా, భర్త మొదటి భార్యతో విడిపోయిన తర్వాత 1990లో రెండో వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వారికి కూడా వివాహాలు అయ్యాయి. సోదరులు ఒప్పించడంతో మొదటి భార్య విడాకుల కోసం అంగీకరించినట్లు తెలిసింది. మొత్తానికి ఈ వార్త స్థానింగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Bride: కారు తీసుకొస్తా.. గదిలోనే ఉండంటూ హోటల్ నుంచి బయటకు వెళ్లిన భర్త.. తిరిగొచ్చే సరికి ఊహించని ట్విస్ట్..!

Updated Date - 2023-08-08T21:23:43+05:30 IST