Viral Video: బాబోయ్.. ఒక్క ఆటోలో 21 మంది ప్రయాణీకులా..? అలా ఎలా ఎక్కించాడా..? అని డౌటా..? ఈ వీడియోను చూస్తే..!
ABN , First Publish Date - 2023-08-23T15:04:49+05:30 IST
డబ్బు సంపాదించాలన్న ఆశ ఉండాలే గానీ.. అత్యాశ ఉండకూడదని పెద్దలు అంటూ ఉంటారు. కొందరు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. మరికొందరు వారి స్వార్థం కోసం పక్క వారిని ఇబ్బందులపాలు చేస్తుంటారు. ఇలాంటి..
డబ్బు సంపాదించాలన్న ఆశ ఉండాలే గానీ.. అత్యాశ ఉండకూడదని పెద్దలు అంటూ ఉంటారు. కొందరు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. మరికొందరు వారి స్వార్థం కోసం పక్క వారిని ఇబ్బందులపాలు చేస్తుంటారు. ఇలాంటి పనులు కొన్ని పెను ప్రమాదాలకు దారి తీస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం. ఓ ఆటో డ్రైవర్ కక్కుర్తితో ఒక్క ఆటోలో ఏకంగా 21మందిని ఎక్కించేశాడు. వామ్మో! అలా ఎలా ఎక్కించాడు..! అని సందేహం కలుగుతోంది కదా. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..
సోషల్ మీడియాలో ఓ ఆటో డ్రైవర్ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ గ్వాలియర్ (Madhya Pradesh Gwalior) పరిధి ఘటిగావ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటిగావ్ ఎస్డీఓపీ సంతోష్ పటేల్ అనే పోలీసుల అధికారి వాహనంలో వెళ్తుండగా.. ఎదురుగా వారికి ఓ ఆటో కనిపిస్తుంది. కొంచెం దగ్గరికి వెళ్లగానే ఆటోను చూసి వాహనంలో ఉన్న పోలీసులు షాక్ అయ్యారు. ఆటోలో జనం కిక్కిరిసి ఉండడంతో పాటూ.. బస్సు తరహాలో పైన కూడా కొందరు కూర్చుని ప్రయాణిస్తున్నారు. సంతోష్ పటేల్ స్వయంగా ఆటోను వీడియో తీస్తూ వెళ్లాడు. కొంచెం దూరం వెళ్లాక.. ఆటోను ఓవర్‌టేక్ చేసి రోడ్డు పక్కన ఆపేశారు. పోలీసు అధికారిని చూడగానే ఆటో డ్రైవర్‌తో పాటూ ప్రయాణికులంతా షాక్ అయ్యారు.
తీవ్ర ఆగ్రహానికి గురైన పోలీసు అధికారి.. అందరినీ ఆటో దిగమని చెప్పాడు. దీంతో చివరకు ఒక్కొక్కరుగా ఆటో నుంచి కిందకు దిగేస్తారు. గొర్రెలు, మేకల తరహాలో... 21మంది ప్రయాణికులను (21 people travel in one auto) ఆటోలో కుక్కేయడం చూసి అంతా షాక్ అయ్యారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు.. అంటూ ఆటో డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంకోసారి ఇలాంటి పని చేస్తే.. కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించి పంపించేశాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఆటో డ్రైవర్ కక్కుర్తి.. మామూలుగా లేదుగా’’.. అని కొందరు, ‘‘ఇలాంటి వారి వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి’’.. అని ఇంకొందరు, పోలీసు అధికారిని మెచ్చుకుంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.