La Rose Noire: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు.. ధర ఏకంగా రూ.250 కోట్లు.. అసలు దీని స్పెషాలిటీ ఏంటంటే..!
ABN , First Publish Date - 2023-08-24T09:07:35+05:30 IST
సామాన్యులకు కారులో తిరగాలన్నది ఓ కల అయితే.. రోజూ కార్లలో తిరిగే ధనవంతులకు రోల్స్ రాయిస్ కారులో తిరగాలనేది ఓ కల. చేతిలో బాగా డబ్బులున్న చాలా మంది ధనవంతులు.. ఈ కలను సాకారం చేసుకుంటుంటారు. ఇలాంటి వారి కోసం రోల్స్ రాయిస్ యాజమాన్యం కూడా అనేక రకాల కార్లను...
సామాన్యులకు కారులో తిరగాలన్నది ఓ కల అయితే.. రోజూ కార్లలో తిరిగే ధనవంతులకు రోల్స్ రాయిస్ కారులో తిరగాలనేది ఓ కల. చేతిలో బాగా డబ్బులున్న చాలా మంది ధనవంతులు.. ఈ కలను సాకారం చేసుకుంటుంటారు. ఇలాంటి వారి కోసం రోల్స్ రాయిస్ (Rolls Royce) యాజమాన్యం కూడా అనేక రకాల కార్లను అందుబాటులోకి తెస్తుంటుంది. కస్టమర్ల అభిరుచికి అగ్గట్టుగా.. రూ.10 కోట్లు, రూ.20 కోట్లు, రూ.30 కోట్లు.. ఇలా ఖరీదైన కార్లను తయారు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం అత్యంత ఖరీదైన కారును అందుబాటులోకి తెచ్చారు. రూ.250 కోట్లతో లా రోజ్ నోయిర్ పేరుతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారును మార్కెట్లోకి విడుదల చేశారు. ఇంత ధర ఉన్న ఈ కారులో ఉన్న ప్రత్యేకతల విషయానికొస్తే..
ఉక్కు, అల్యూమినియం, కార్బన్ ఫైబర్‌తో తయారు చేసిన లా రోజ్ నోయిర్ (La Rose Noir) కారులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ కారును సాధారణంగానే కాకుండా.. పూర్తిగా టాప్ లేకుండా కూడా ప్రయాణాన్ని ఎంజాయ్ చేయొచ్చు. పైకప్పు ప్యానెల్‌ను కార్బన్ ఫైబర్‌తో ఎలక్ట్రోక్రోమిక్ గ్లాస్ విభాగంతో తయారు చేశారు. వాహనం లోపలి భాగం రోల్స్ రాయిస్‌లోని క్రాఫ్ట్, డిజైన్‌ను సూచిస్తుంది. అదేవిధంగా 1,603 బ్లాక్ వుడ్ వెనీర్ త్రిభుజాల ముక్కలతో డిజైన్ చేయబడింది. మరోవైపు వీల్స్‌లో మెస్మరైజింగ్ ‘మిస్టరీ’ పెయింట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇది దగ్గరగా చూస్తే నలుపు, దూరం నుంచి ముదురు ఎరుపు రంగులో కనిపిస్తుంది.
అలాగే వాహనం లోపలి భాగంలో సీట్లు తదితర విడి భాగాలు.. ముదురు, ఎరుపు, లేత ఎరుపు రంగు తోలుతో గులాబీ రేకుల ముత్యాల ఆకృతిని కలిగి ఉంటాయి. ఇది చూసేందుకు గులాబీ రేకులు పైనుంచి కిందకు రాలుతున్న అనుభూతిని కలుగజేస్తుంది. ఇక ఈ కారు ఇంజిన్ విషయానికొస్తే.. డ్రాప్ టెయిల్ బెస్పోక్ ట్విన్-టర్బోచార్జ్డ్ 6.75-లీటర్ V12 ఇంజన్ ద్వారా ప్రొఫైల్ చేయబడింది, ఇది 601hp, 840Nm టార్క్‌ని అందించడానికి రూపొందించబడింది. ఈ అద్భుతమైన పవర్‌ప్లాంట్ థ్రిల్లింగ్ డ్రైవ్‌కు హామీ ఇస్తుంది, V12-ఇంజిన్ డాన్‌కు సమానమైన లీగ్‌లో డ్రాప్ టెయిల్‌ను ఉంచుతుంది. లా రోజ్ నోయిర్ కారు గరిష్ట వేగం గంటకు 250 కి.మీ. ఈ కారులో రివర్సిబుల్ రూఫ్, ఎలక్ట్రోక్రోమిక్ గ్రాస్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. అదేవిధంగా అధునాతన సాంకేతికత, అనేక ఫీచర్లు కూడా ఉన్నాయి.