Viral Video: ఏం కలుపుతున్నార్రా బాబూ.. పొరపాటున దీన్ని తిన్న వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో..!
ABN , First Publish Date - 2023-08-22T19:50:55+05:30 IST
ఆచార, సాంప్రదాయాలతో పాటూ ఆహార అలవాట్లు కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి. ఏ ప్రాంతాల్లో అయినా స్థానికంగా ఓ ఫేమస్ వంటకం అంటూ ఒకటి ఉంటుంది. దానికి భోజన ప్రియులు ఫిదా అవుతుంటారు. వీరి అభిరుచికి తగ్గట్టే వ్యాపారస్తులు కూడా అందులో...
ఆచార, సాంప్రదాయాలతో పాటూ ఆహార అలవాట్లు కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి. ఏ ప్రాంతాల్లో అయినా స్థానికంగా ఓ ఫేమస్ వంటకం అంటూ ఒకటి ఉంటుంది. దానికి భోజన ప్రియులు ఫిదా అవుతుంటారు. వీరి అభిరుచికి తగ్గట్టే వ్యాపారస్తులు కూడా అందులో కొత్త కొత్త వంటకాలు, వెరైటీ రెసిపీలు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఇలాంటి వంటకాలను చూసినప్పుడు కొన్నిసార్లు నోరూరుతుంటే.. మరికొన్నిసార్లు ‘‘వామ్మో! ఇదేం వంటకంరా.. నాయనా’’.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి విచిత్ర వంటకాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, వైరల్ అవుతున్న వీడియో చూసి నెటజన్లు అవాక్కవుతున్నారు. ‘‘ఏం కలుపుతున్నార్రా బాబూ.. పొరపాటున దీన్ని తిన్న వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో..!’’.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర (Madhya Pradesh, Maharashtra) తదితర రాష్ట్రాల్లో అటుకులతో చేసిన వివిధ వంటకాలు చాలా ఫేమస్. ఆయా ప్రాంతాల్లో కొందరు చిరు వ్యాపారులు ఇదే అటుకుల్లో ఏవోవే కలిపి చిత్రవిచిత్రమైన వంటకాన్ని సిద్ధం చేస్తుంటారు. ఇలాంటి అటుకుల వంటకానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రాత్రి నానబెట్టిన అటుకులను తీసుకుని, అందులో ముందుగా కాస్త ఉప్పు వేసి మిక్స్ చేస్తాడు. తర్వాత అందులో పంచదార వేసిన అనంతరం కొన్ని అరటిపండు ముక్కలను జత చేస్తాడు. ఇంతటితో డిష్ రెడీ అయిందనుకుంటే పొరపాటే.
Skin Care: ముఖానికి క్రీమ్స్ వాడుతున్నారా..? రాసుకోగానే ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే పారేసేయండి..!
ఆ తర్వాత అందులో రసగుల్లాను జోడిస్తాడు. మళ్లీ అందులో కొంచెం పాలు, పెరుగును కూడా కలిపేస్తాడు. చివరగా అన్నింటినీ బాగా మిక్స్ చేసి.. ఆవురావుమంటూ ఎదురుచూస్తున్న కస్టమర్ల చేతిలో పెడతాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘నాకు తిండిమీదనే విరక్తి పుడుతోంది’’.. ‘‘ఇంతకీ ఇది తినేందుకేనా’’.., ‘‘నాకు ఎంతో ఇష్టమైన వంటకాన్ని నాశనం చేశారు’’.., ‘‘దయచేసి ఆపండి.. మీకు దండం పెడతా’’.., ‘‘ఇలా ఏవేవో మిక్స్ చేసి.. భోజనప్రియుల మనోభావాల్ని దెబ్బతీయకండి’’.. ‘‘ఫుడ్ పాయిజనింగ్ పూర్తిగా ఫ్రీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.92లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.