MP Komati Reddy: కేసీఆర్ పతనం మొదలైంది

ABN , First Publish Date - 2023-09-16T21:27:38+05:30 IST

తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధీ (Sonia Gandhi) హైదరాబాద్ కొచ్చారని.. కాంగ్రెస్ నేతలు(Congress leaders) స్వాగతం పలికాం.. తెలంగాణ ప్రజలు కూడా రేపు తుక్కుగుడ సభకు తరలి రావాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komati Reddy Venkat Reddy) వ్యాఖ్యానించారు.

MP Komati Reddy: కేసీఆర్ పతనం మొదలైంది

హైదరాబాద్: తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధీ (Sonia Gandhi) హైదరాబాద్ కొచ్చారని.. కాంగ్రెస్ నేతలు(Congress leaders) స్వాగతం పలికాం.. తెలంగాణ ప్రజలు కూడా రేపు తుక్కుగుడ సభకు తరలి రావాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komati Reddy Venkat Reddy) వ్యాఖ్యానించారు. శనివారం నాడు హోటల్ తాజ్ కృష్ణ‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..కేసీఆర్(KCR) పతనం మొదలైంది... ఎన్ని హామీలు ఇచ్చిన ఓటమి తప్పదు.అప్పుల రాష్ట్రాన్ని బాగుచేసుకునే బాధ్యత అందరిపై ఉంది. ప్రజలు విజయభేరి సభకు భారీగా తరలి రావాలి. బీజేపీ(BJP) లేదు, బీఆర్ఎస్(BRS) ఓడిపోతుంది.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. మంత్రి కేటీఆర్‌(Minister KTR)కు ఏం తెల్సు తెలంగాణ ఉద్యమం గురించి అవాకులు చెవాకులు పెలుతున్నాడు. అసలు కేటీఆర్(ktr) అప్పుడు ఎక్కడున్నాడు. ఫ్లోరైడ్ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మూసీ ప్రక్షాళన ఏమైంది. చింతమడకలో ఇంటికి 10లక్షలు ఇస్తావ్.. మరి ఇతర గ్రామాల ప్రజలకు ఎందుకు ఇయ్యవ్. రేపు సభలో చెబుతాం .. మేము ఏం చేసేదో.. చేసేదే చెబుతాం. తెలంగాణ ద్రోహులను మంత్రి వర్గంలో పెట్టుకున్నావు. 90 రోజుల్లో బీఆర్ఎస్ నేతలు ఎక్కడికి పోతరో .. చూద్దాం. ఇంటికి పోతరా.. జైలు కు పోతరా.. ఒకటో తేదీన జీతం ఇయ్యని సర్కార్ కేసీఆర్ సర్కార్. రాష్ట్రం కోసం 1200 మంది చనిపోతే ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావ్.మేము అధికారంలోకి వచ్చాక అన్ని చేస్తాం.ఈ రాత్రి డిన్నర్‌కి పీసీసీ కి చెందిన 36 మందికి తాజ్ కృష్ణకు ఆహ్వానంలో ఉంది. ఎంపీలు , ఎమ్మెల్యేలు , మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు , సీనియర్ నాయకులకు ఆహ్వానం ఉంది’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-09-16T21:27:38+05:30 IST